టీవీ: జానకి కలగనలేదు ఫేమ్ మల్లికా గురించి మీకు తెలుసా..?

Divya
ఇటీవల బుల్లితెర పై ఎన్నో ధారావాహికలు తెలుగు ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ఈ సీరియల్స్ కు మరింత క్రేజ్ పెరిగిందని చెప్పవచ్చు. అందుకు తగ్గట్టుగానే ఈ సీరియల్స్ దర్శకనిర్మాతలు కూడా సొమ్ము చేసుకోవడం కోసం సకల ప్రయత్నాలు చేస్తున్నారు.. తమ కథలతో, డైరెక్షన్ లతో, నటుల అందాలతో తెలుగు బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.. అంతేకాదు సినిమాలకు మించిన కామెడీ , యాక్షన్, రొమాంటిక్ నేపథ్యాలతో సీరియల్స్ ను తెరకెక్కిస్తూ.. ప్రేక్షకులను టీవీలకు అతుక్కుపోయేలా చేస్తున్నారు. అంతేకాదు ప్రేక్షకులలో టెన్షన్, ఆతృత ను కూడా ఈ సీరియల్స్ పుట్టిస్తున్నాయి..

అందులో భాగంగానే స్టార్ మా సీరియల్స్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక అలాంటి సీరియల్స్ లో భాగంగానే ఈమధ్య జానకి కలగనలేదు సీరియల్ కూడా బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇందులో అందాల తార సీనియర్ నటి రాశి కూడా అత్త, అమ్మ పాత్రలో చాలా బాగా నటిస్తోంది. చదువుకున్న కోడలు వస్తే తన కొడుకుకు ఇబ్బంది కలుగుతుందని, చదువు లేని కోడలును ఇంటికి తీసుకు రావాలని ఆరాటపడే ఒక తల్లి మనసును చక్కగా చూపించారు. ఇందులో ప్రతీ క్యారెక్టర్ కూడా తమ నటనతో అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

నెగిటివ్ రోల్ లో నటిస్తూ.. రాశి కోడలుగా మల్లిక అలియాస్ విష్ణుప్రియ మంచి మార్కులు కొట్టేస్తోందని చెప్పాలి. సహ నటుడు సిద్ధార్థ వర్మ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆగస్టు 19 వ తేదీన వెస్ట్ గోదావరి లోని హనుమాన్ జంక్షన్ లో జన్మించింది. ఇక ఈమె తండ్రి శ్రీనివాస్ ఇంటీరియర్ డిజైనర్. తల్లి గృహిణి. ఈమె సోదరుడు రాజేష్. అయితే కొంతకాలానికి ఈమె తల్లి క్యాన్సర్ తో చనిపోవడంతో నటన మీద ఆసక్తి ఉండటం చేత తమిళంలో నటించడం మొదలుపెట్టింది. తర్వాత తెలుగులో ఈ రోజుల్లో అనే మూవీ ద్వారా ఇండస్ట్రీకి అడుగుపెట్టింది విష్ణుప్రియ.
ఆ తర్వాత పిల్లా నువ్వు లేని జీవితం, రభస ,రామయ్య వస్తావయ్యా వంటి ఎన్నో సినిమాలలో నటించింది. ఇప్పుడు బుల్లితెరపై అభిషేకం సీరియల్ తోపాటు జానకి కలగనలేదు అనే సీరియల్లో నెగెటివ్ రోల్ లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: