"బిగ్ బజ్" హోస్ట్ గా ఆరియానా స్థానంలో హాట్ యాంకర్?

VAMSI
బుల్లి తెరపై తనదైన శైలిలో అలరించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వ్యాఖ్యాత శ్రీముఖి. ఇన్స్టంట్ పంచ్ లతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది ఈ యాంకర్ . వెండి తెరపై కూడా అప్పుడప్పుడు తళుక్కుమని అవకాశాలను సద్వినియోగ పరచుకుంటూ వస్తోంది ఈ అందాల తార. ఇటీవలే "క్రేజీ అంకుల్స్" అనే చిత్రంలో ప్రధాన పాత్రలో మెరిసింది ఈ ముద్దుగుమ్మ. బుల్లి తెరపై యాంకర్ సుమ తరవాత ఆ రేంజ్ లో ప్రేక్షకుల్ని అలరించగల యాంకర్ ఎవరంటే శ్రీ ముఖినేనని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తన యాంకరింగ్ స్టైల్ తో పాపులారిటీ గ్రాఫ్ ను అలా పెంచేసుకున్న శ్రీ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. గత కొంత కాలంగా తన హాట్ ఫోటో షూట్ లతో మరింత క్రేజ్ ను పెంచుకుంటున్న ఈ బ్యూటీ అతి తక్కువ సమయంలోనే గొప్ప యాంకర్ గుర్తింపు పొందింది.
పటాస్ షో తో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన శ్రీ ముఖి బిగ్ బాస్ హౌజ్ లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. సీజన్ 3 లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో ఒకటిగా నిలచి గట్టి పోటీ ఇచ్చింది. అప్పట్లో ఈమె లక్షల్లో పారితోషికం తీసుకున్నట్లు ప్రచారాలు కూడా జరిగాయి. ఇదిలా ఉంచితే ఇపుడు ప్రస్తుతం బిగ్ బాస్ బజ్ లో ఆరియానా యాంకర్ గా చేస్తున్న విషయం తెలిసిందే. హౌజ్ నుండి ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యులు నేరుగా బిగ్ బజ్ కి వెళ్తారు. ఇక యాంకర్ గా చేస్తున్న ఆరియానా బిగ్ బజ్ కి వచ్చిన వారిని కాస్త డీప్ గా ఇంటర్వ్యూ చేసి వారి మనసులోని మాటలను బయటకు తీసుకురావాల్సి ఉంటుంది. అప్పుడే షో రక్తి కడుతుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. అయితే అలా అక్కడికి వచ్చిన సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసి ప్రేక్షకుల్ని అలరించడంలో ఆరియనా అంతగా అట్రాక్ట్ చేయలేకపోతుందనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
అసలు బిగ్ బజ్ అనేది ఆసక్తికరమైన షో కానీ ఆరియానా యాంకరింగ్ అందుకు సూట్ కాలేదన్న కామెంట్లు వినపడుతున్న నేపథ్యంలో ఆ స్థానంలో శ్రీ ముఖిని రంగంలోకి దించేందుకు ప్లాన్ చేస్తోందట బిగ్ బాస్ యాజమాన్యం. ఇప్పటికే ఈ విషయంపై చర్చలు జరిగి ఓ నిర్ణయానికి కూడా వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే బిగ్ బజ్ లో శ్రీ ముఖి లౌడ్ సౌండ్ వినిపించబోతోందని వినికిడి. అయితే ఇదే కనుక నిజమైతే బిగ్ బజ్ రేటింగ్స్ అలా పెరిగిపోతాయి అనడంలో అనుమానం లేదు అంటున్నారు ఈ వార్త విన్న నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: