బిగ్ బాస్- 5 :ప్రియా పై లహరి హగ్ ఎఫెక్ట్.. ?

MADDIBOINA AJAY KUMAR
బిగ్ బాస్ హౌస్ లో ఎంత మంచి పేరు తెచ్చుకున్నా కూడా ఒక్క‌రోజు జ‌రిగిన గొడ‌వ‌లు మాట్లాడిన మాట‌లు స‌భ్యుల‌పై ఎంతో ప్ర‌భావాన్ని చూపించ‌వ‌చ్చు. చిన్న చిన్న విష‌యాలే ఎలిమినేష‌న్ కు దారి తీయ‌వ‌చ్చు. బిగ్ బాస్ లో అన్ని కెమెరాలు ఫోక‌స్ పెడ‌తాయి కాబ‌ట్టి ఏం మాట్లాడాల‌న్నా కూడా ఆచి తూచి మాట్లాడాలి. తేడా వ‌స్తే ఎలిమినేష‌న్ త‌ప్ప‌దు. ముఖ్యంగా గ‌త సీజ‌న్లు చూసిన‌ట్ట‌యితే నోటిని ఎంత జాగ్ర‌త్త‌గా ఉంచుకుంటే అంత మంచింది. ఇక తాజాగా బిగ్ బాస్-5 లో నోరు జారిన ప్రియాకు కూడా బ‌య‌ట నెగిటివిటి మొద‌లైంది. ప్రియా ఇటీవ‌ల యాంక‌ర్ ర‌వికి మరియు ల‌హ‌రికి మ‌ధ్య ఎఫైర్ ఉన్న‌ట్టు షాకింగ్ కామెంట్లు చేసిన సంగ‌తి తెలిసిందే. యాంక‌ర్ ర‌వి ల‌హ‌రి బాత్రూంలో అద్ధ‌రాత్రి హ‌గ్ చేసుకున్నారంటూ ప్రియా కామెంట్లు చేయ‌డంతో ర‌చ్చ‌ర‌చ్చ‌గా మారింది. 

నిజానికి ప్రియా వాద‌న లో నిజం ఉందేమోగాని ఆమె చెప్పే విధానం మాత్రం అస్స‌లు భాగా లేద‌ని ప్రేక్ష‌కులు అభిప్రాయ‌ప‌డ్డారు. ఇక హౌస్ లో ఎలిమినేష‌న్ లో స‌మయంలోనే ప్రియా అలాంటి కామెంట్లు చేయ‌డంతో మిగ‌తా కంటెస్టెంట్ లు కూడా ప్రియాకే ఓట్లు వేసి నామినేషన్ లోకి దింపారు. కొంత‌మంది నిజంగానే ప్రియా చేసిన వ్యాఖ్య‌లు హ‌ర్ట్ అయ్యి నామినేట్ చేస్తే మ‌రికొంద‌రు కంటెస్టెంట్ లు మాత్రం దొరికిందే సందు అనుకుని నామినేట్ చేశారు. అలా నామినేష‌న్ లోకి వ‌చ్చిన ప్రియాపై ఇప్పుడు ప్రేక్ష‌కులు కూడా ప‌గ‌తీర్చుకుంటున్న‌ట్టే క‌నిపిస్తోంది.

ప్రియా ఒక అమ్మాయిని ప‌ట్టుకుని అలాంటి కామెంట్లు చేయ‌వ‌ద్ద‌ని ఎక్కువ‌గా అమ్మాయిలే ప్రియాకు వ్య‌తిరేఖంగా కామెంట్లు చేస్తున్నారు. కొంత వ‌ర‌కు స‌పోర్ట్ వ‌స్తున్నా కూడా అది నెగిటివి మ‌ధ్య‌లో కొట్టుకుపోతున్న‌ట్టే క‌నిపిస్తోంది. ఇక ఈ వారం ఎవ‌రు ఎలిమినేట్ అవుతున్నార‌ని కొన్ని మీడియాలు పోల్స్ పెట్ట‌గా అందులోనూ ప్రియా పేరే ఎక్కువ‌గా వినిపిస్తోంది. అంతే కాకుండా ప్రియాకు ఓట్లు కూడా త‌క్కువ‌గా పడ్డాయంటూ లీకు రాయుల్లు లీక్ చేస్తున్నారు. దాంతో ల‌హ‌రి హ‌గ్ ఎఫెక్ట్ ప్రియా పైనే పడుతుంద‌ని అంతా అభిప్రాయ‌ప‌డుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: