బిగ్ బాస్ 5: ప్రియ.. హమీదాను అలా అనకుండా ఉంటే బాగుండేది ?

VAMSI
ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో వివాదాల గోలలు ఎక్కువయ్యాయి. రొమాన్స్ టచ్ లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇంటి సభ్యులు ఒకరిపై ఒకరు ఓ రేంజ్ లో నిందలు వేసుకోవడం. ఆ తరవాత పెద్ద యుద్దమే చేయడం కామన్ అయిపోయింది. ఒకరేమో వాళ్లు బాత్రూం లో దూరి హగ్ చేసుకుంటున్నారు అంటే..మరొకరు కిచెన్ లో నాకు ఆ విధంగా సైగలు చేశాడు, నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు అంటూ ఆరోపణలు చేస్తున్నారు. హామీదా ప్రియని నామినేట్ చేస్తూ మొన్న నువ్వు నేను నా జా నొప్పి అని బాధపడుతుంటే నీకేమైనా సర్జరీ జరిగిందా అని అడిగావు. ఇలాంటి నేషనల్ షో లో నిలబడి నాకు సర్జరీలు జరిగాయన్న మాటలు మాట్లాడితే ప్రజలు నా గురించి ఏమనుకుంటారు అంటూ ఇల్లు దద్దరిల్లేలా అరిచింది.
నా స్కిన్ చాలా సెన్సిటివ్ చిన్నగా తగిలిన గీతలు పడిపోతాయ్. అంత మాత్రాన అవి చూసి నీకు సర్జరీ జరిగిందా అని అడుగుతావా అంటూ ప్రియపై విరుచుకు పడింది. ఇదంతా పక్కన పెడితే నిన్నటి ఎపిసోడ్ లో కాసేపు నామినేషన్ ప్రక్రియ కొనసాగింది. చివరికి ప్రియ, లహరి, మానస్, శ్రీరామచంద్ర మరియు ప్రియాంక లు నామినేట్ అయ్యారు. ఇక ఆ తరువాత ఇంటి సభ్యులకు పెళ్ళిచూపుల కాన్సెప్ట్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో లహరికి శ్రీ రామ్ చంద్రతో పెళ్ళి చూపులు. హామీదా అతడి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. రవి పెళ్లి కూతురికి మేనమామ, షణ్ముఖ్ పెళ్లిళ్ల పేరయ్య, కాజల్ పెళ్లి కొడుకుకి అక్క ఇలా ఒక్కొకరికి ఒక్కో పాత్ర ఇచ్చారు. ఇక్కడ సన్ని, కాజల్ లు మాత్రం కామెడీని బాగా పండించారు.
సన్నీ తన మైక్ లో ఉన్న ఆర్టికల్ చూపిస్తూ ఇది చాలా బాగుంది కదా అని కాజల్ ని అడగటం, అవును అని కాజల్ చెప్పగానే అయితే దీన్ని మళ్ళీ ఇక్కడే పెట్టేస్తా అంటూ తన దగ్గరే ఉంచుకోవడం ఇలా కామెడీని బాగా పండించి ప్రేక్షకులను నవ్వించారు. హామీదా నువ్వు పెళ్లి చేసుకుంటే నా పరిస్థితి ఏంటి అంటూ శ్రీ రామ్ వెంట పడటం నిజం సీన్ లాగానే అనిపించింది. మరో వైపు రవి నన్ను గుర్తించండి నాకు పెళ్ళి కాలేదు లహరిని నేను చేసుకుంటాను అంటూ వాళ్ళ అక్క (యాని మాస్టర్) బావ (నటరాజ్ మాస్టర్) వెంటపడటం చాలా ఫన్నీగా అనిపించింది...అలా పెళ్ళిచూపులు ఎపిసోడ్ కొనసాగుతోంది. ఇందులో బెస్ట్ పెర్ఫర్మ్ చేసిన వారు కెప్టెన్సీకి పోటీదారులుగా నిలుస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: