BIGG BOSS-5 : బాత్రూంలో మిడ్ నైట్ హ‌గ్గులు...ప్రియా సంచ‌ల‌నం..!

MADDIBOINA AJAY KUMAR
బిగ్ బాస్ లో అన్ని రోజులూ ఒక‌లా ఉంటే నామినేష‌న్ రోజు మాత్రం మ‌రోలా ఉంటుంది. అప్ప‌టి వ‌ర‌కూ క‌లిసి ఉన్న సభ్యులు ఒక‌రిపై ఒక‌రు బాంబులు పేలుస్తూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇక మూడో వారం నామినేష‌న్ లో భాగంగా హౌస్ లో ర‌చ్చ మొద‌లైంది. ముఖ్యంగా న‌టి ప్రియా కంటెస్టెంట్ ర‌వి మ‌రియు ల‌హ‌రి పై చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా మారాయి. నామినేష‌న్ లో భాగంగా మీరు నాతో స‌రిగ్గా మాట్లాడ‌టం లేద‌ని...చాలా డిస్టెన్స్ మెయిన్టెయిన్ చేస్తున్నార‌ని ప్రియాతో చెప్పి ల‌హ‌రి నామినేట్ చేసింది. దాంతో ప్రియా నువ్వు ఇంట్లో ఉన్న మ‌గ‌వాళ్లంద‌రితో చాలా బిజీగా ఉంటున్నావంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. దాంతో నేను ఇంట్లో ఎవ‌రెవ‌రితో బిజీగా ఉన్నాను..మిగితా వాళ్లతో కూడా మాట్లాడుతున్నాన‌ని యానీ మాస్ట‌ర్ తో మాట్లాడుతున్నా అని అంద‌రితో మాట్లాడుతున్నా అని చెప్పింది. 

దాంతో సేఫ్ గేమ్ అంటూ ప్రియా చ‌ప్ప‌ట్లు కొట్టింది. ఇక ప్రియా కు నామినేష‌న్ స‌మయం వ‌చ్చే స‌రికి తిరిగి ల‌హ‌రిని నామినేట్ చేసింది. దాంతో మరోసారి ల‌హ‌రి నేను ఏం చేస్తున్నానో చెప్పాల‌ని అడ‌గ్గా ఇంట్లో మ‌గ‌వాళ్లంద‌రితో బిజీ అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఎవ‌రితో బిజీ అని అడగ్గా మిడ్ నైట్ బాత్రూంలో ర‌వితో హ‌గ్ చేసుకున్నావంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. దాంతో ఒక్క‌సారిగా హౌస్ లో అంతా షాక్ అయ్యారు. ర‌వి బ‌ర్త్ డే ఉంద‌ని అత‌డిని తాను బ్ర‌ద‌ర్ లా భావిస్తున్నాన‌ని అందుకే అత‌డికి ఒక వైట్ ష‌ర్ట్ పంపాల‌ని బిగ్ బాస్ ను రిక్వెస్ట్ చేశాన‌ని ల‌హ‌రి చెప్పింది.

అదే విష‌యాన్ని ముందుగా విశ్వ కు కూడా చెప్పి వెళ్లాన‌ని ల‌హ‌రి చెప్పింది. ర‌వి కూడా ప్రియాపై ఫైర్ అయ్యారు. ఇది టెలివిజ‌న్ షో అని అలాంటి స్టేట్మెంట్ లు ఇవ్వ‌కూడ‌ద‌ని మండి ప‌డ్డారు. నేను హ‌మీదా సిరితో కూడా క్లోజ్ గా ఉంటాన‌ని ర‌వి చెప్పారు. బాత్రూం లో హ‌గ్గులు అంటూ ఎలా మాట్లాడ‌తార‌ని ర‌వి అన్నారు. తాను ల‌హ‌రిని ఓ సిస్ట‌ర్ లా భావిస్తున్నాన‌ని ర‌వి చెప్పుకొచ్చాడు. ఇక ఆ త‌ర‌వాత స‌న్నీ కూడా ప్రియ పై ఫైర్ అయ్యాడు. మీరు కూడా ఆడ‌వాళ్ల‌ని మ‌రొక‌రి గురించి అలా ఎలా మాట్లాడ‌తార‌ని స‌న్ని కామెంట్ చేశాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: