షాక్ లో బిగ్ బాస్ నిర్వాహకులు..కారణం ఇదేనా..?

Divya
ఇటీవల జరిగిన ఒక సంఘటన చూసి బిగ్ బాస్ నిర్వాహకులు షాక్ కి గురయ్యారు.. అదేమిటంటే ముగిసిన నాలుగు సీజన్లలో ఇప్పటివరకు అందరూ స్టార్ నటీనటులను తీసుకొచ్చి సీజన్లను పూర్తి చేసిన విషయం తెలిసిందే . ఈసారి మాత్రం కొత్త వాళ్ళను తీసుకొచ్చి సీజన్ ఫైవ్ నిర్వహిస్తుండడంతో , టిఆర్పి రేటింగ్ కూడా పెద్దగా ఆశించలేదు బిగ్ బాస్ నిర్వాహకులు ..కానీ ఈ సారి మాత్రం 18 + ని అందుకోవడంతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.. అంతేకాదు మునుపెన్నడూ లేని విధంగా కొత్త వాళ్లు కూడా ఈ షో ని అత్యంత ఘనవిజయం చేస్తున్నారు అంటూ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా కారణంగా టాప్ సెలబ్రిటీలకు ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వలేక, సోషల్ మీడియా ద్వారా  పాపులర్ పొందిన కొంతమంది చిన్న తారలను తీసుకొచ్చి ఈ షోలో పెట్టడం జరిగింది. అందుకే బిగ్ బాస్ నిర్వాహకులు ఎటువంటి టిఆర్పి రేటింగ్ కూడా ఆశించలేదు.. కానీ ఈసారి ప్రేక్షకులు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కి పట్టం కట్టారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.. నిజానికీ ఈ 4 సీజన్ లలో బాగా పాపులారిటీని అందుకున్న  శివ బాలాజీ, నవదీప్, వరుణ్ సందేశ్, సామ్రాట్, తేజస్వి మదివాడ, పునర్నవి, అభిజీత్, మోనాల్ గజ్జర్ వంటి ప్రముఖ సినీ తారలను బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
కానీ ఈ సంవత్సరం, మనకు అంతగా తెలిసిన ముఖాలు లేని లహరి, మానస్, విశ్వ ఉన్నారు. కోవిడ్ కారణంగా పెద్ద స్పాన్సర్‌షిప్‌లు లేకపోవడంతో  బిగ్ బాస్ పాపులారిటీ  లేని వ్యక్తులను ఎంచుకున్నట్లు సమాచారం . ఇక్కడ  ఎవరికైనా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే TRP 18+ పాయింట్లను తాకడంతో   అందరూ  ఆశ్చర్యపోయారు. ఈ కార్యక్రమం కోసం టీవీ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే వాస్తవాన్ని మనం గమనించవచ్చు.
ముఖ్యంగా ఈ షోకి రామ్ చరణ్ రావడంతో టిఆర్పి రేటింగ్ లో అత్యున్నత స్థానాన్ని సంపాదించుకుంది అని తెలుస్తోంది. ఇక ఈ కారణంగానే రాబోయే ఎపిసోడ్ లలో మరో ప్రముఖ స్టార్ హీరో లను గెస్ట్ లుగా తీసుకురావడానికి, బిగ్ బాస్ నిర్వాహకులు ఆలోచిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: