టీవీ : అత్తారింటికి దారేది సీరియల్ ముకుంద్ సినిమాల్లో నటించాడని తెలుసా..?

Divya
ఇటీవల కాలంలో ఈ టీవీలో ప్రసారం అవుతున్న ఎన్నో సీరియల్స్ మంచి ప్రేక్షకాదరణ పొందుతున్నాయి.. మధ్యాహ్నం ప్రసారమయ్యే అత్తారింటికి దారేది సీరియల్ రోజురోజుకు సరికొత్త కథతో, ప్రేక్షకులలో ఉత్కంఠ రేపుతోంది. ఇందులో నటించే నటీనటులు అందం ,అభినయంతో పాటు ప్రేక్షకులకు తమ నటనతో బాగా దగ్గరవుతున్నారు.. అలాంటివారిలో అత్తారింటికి దారేది సీరియల్ హీరో ముకుంద్ కూడా ఒకరు. సీరియల్ తో మంచి ప్రేక్షకాదరణ పొందుతున్నారు ముకుంద్.. అంతేకాదు సీరియల్ కూడా మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతోంది.
ఈయన అసలు పేరు శ్రవణ్ కుమార్. సెప్టెంబర్ 3వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతంపురం జిల్లాలో వ్యవసాయ కుటుంబానికి చెందిన పెద్దిరెడ్డి,లక్ష్మీదేవి అనే దంపతులకు శ్రవణ్ జన్మించాడు. రాధ అనే ఒక చెల్లి కూడా ఉంది. ముకుంద్ బెంగుళూరులో తన మావయ్య , బాబాయ్ ల దగ్గర పెరిగాడు. ఇక అక్కడే బెంగుళూర్ లో ప్రాథమిక విద్య ను పూర్తిచేసాడు. ఆ తర్వాత విజయవాడ లోని చైత్యన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తిచేసి, తిరిగి బెంగుళూరులో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసాడు.
అయితే రెండు సంవత్సరాల పాటు స్ట్రక్చరల్ ఇంజనీర్గా పనిచేసిన ముందుకు చిన్నప్పటినుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం తన బాబాయి సహకారంతోనే వైజాగ్ లో ఉన్న సత్యానంద శిక్షణా స్కూల్లో చేరి నటనలో మంచి ప్రావీణ్యం పొందాడు ఇక తర్వాత బెంగళూరులో జరుగుతున్న ఆడిషన్స్ కి  వెళ్ళిన ముకుంద్ ఒక కన్నడ సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు. ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిన పోవాల్సి వచ్చింది.ఇక ఆ తర్వాత షార్ట్ ఫిలిమ్స్, సీరియల్స్ లో కూడా యాక్ట్ చేసి,కన్నడ ఆడియన్స్ ని బాగా  అలరించాడు. సూపర్ బాయ్ అనే బిరుదు కూడా ఇచ్చారు. తెలుగులో ఒక చిన్న విరామం అనే మూవీకి ముకుంద్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు. ఒక  షార్ట్ ఫిలిం కూడా చేసాడు. ఇక అత్తారింటికి దారేది సీరియల్  ఆడిషన్స్ కి వెళ్లి, సెలెక్ట్ కావడంతో ముకుంద్ గా ఆ సీరియల్ హీరోగా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: