బిగ్ బాస్ 5 : అతను రాముడు కాదు కృష్ణుడు... హమీదా ఉండగానే ?

VAMSI
ఎప్పటి లాగే నిన్నటి బిగ్ బాస్ 5 ఎపిసోడ్ కూడా ఎంతో రసవత్తరంగా సాగింది. నిజానికి షాకింగ్ అంశాలు చాలానే జరిగాయి. అసలు నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగింది అలా ఓ చిన్న లుక్కేద్దాం పదండి. నిన్నటి ఎపిసోడ్ లో బాల్ పట్టు లగ్జరీ బడ్జెట్ కొట్టు అంటూ బిగ్ బస్ టాస్క్ ఇవ్వగా అందరూ సందడిగా బాగానే ఆడారు. ఆ తర్వాత లివింగ్ రూమ్ లో ఒక చోటకు చేరిన ఇంటి సభ్యులు అందరూ కలిసి ఏకాభిప్రాయంతో ఒక బెస్ట్ పర్ఫార్మర్ మరియు ఒక వరెస్ట్ పర్ఫార్మర్ పేరును బిగ్ బాస్ కు తెలపండి అని చెప్పారు. ఎవరికి వారు తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఇందులో ఎక్కువగా బెస్ట్ ఫర్పార్మర్ గా నటరాజ్ కు ఎక్కువ ఓట్లు రాగా, సన్నీ  కి వరస్ట్ పర్ఫార్మర్ గా ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఎప్పుడూ సన్నీ వైపు ఉండే సిరి కూడా వరెస్ట్ పర్ఫార్మర్ గా సన్నీ పేరు చెప్పడం కాస్త ఆశ్చర్యం అనిపించింది. అంత మంది తన పేరు చెప్పినా పాజిటివ్ గానే తీసుకున్నాడు సన్నీ. ఈ ఎపిసోడ్ సన్నీని  సీజన్ 2 కౌశల్ తో పోలుస్తున్నారు నెటిజన్లు. 

కౌశల్ కూడా ఇలాగే ముక్కుసూటిగా ఉంటాడు, ఎవరితోనూ అంత ఈజీగా కలవడు, అతడు నవ్వాలి అంటే నిజంగా నవ్వే విషయమే అయి ఉండాలి. ఎవరి కోసమూ చిరునవ్వు చిందించడు ఒక్క మాటలో చెప్పాలంటే తను తనలా ఉంటాడు నటించడు. అందుకే అప్పట్లో బిగ్ బాస్ హౌస్  లో ఇంటి సభ్యులకు విలన్ లా కనిపించాడు. ఎక్కువ సార్లు నామినేట్ అయ్యాడు. కానీ అంతకన్నా ఎక్కువ ప్రజాధరణతో  వెనక్కి తిరిగి వచ్చి టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. ఇపుడు సన్నీ కూడా దాదాపుగా కౌశల్ లాంటి ఆటిట్యూడ్ నే కలిగి ఉన్నాడు. అలాగే ఇంటి సభ్యులు కూడా ఎక్కువుగా సన్నీని టార్గెట్ చేస్తుంటారు. ఇక్కడే బయట జనాలకు ఎక్కువ కనెక్ట్ అవుతారు. వారు ఎన్ని సార్లు నామినేట్ చేస్తే అంతగా హైలెట్ అవుతున్నాడు సన్నీ మరీ మునుముందు ఏం జరగబోతోందో చూద్దాం. ఇక నిన్నటి ఎపిసోడ్ లో మరో అద్భుతం జరిగింది.

రవి మరియు కాజల్ లను ఇంటి సభ్యుల మనసు లో గర్ల్ ఫ్రెండ్, భార్య, పని మనిషి అనే కాన్సెప్ట్ మీద ఇంటర్వ్యూ చేయమని బిగ్ బాస్ సూచించగా శ్రీ రామ్ గర్ల్ ఫ్రెండ్ గా అయితే సిరి ఇంకా హమీదా ఓకే అంటూ హమీదా తన దృష్టిలో కేవలం ఒక క్రష్ మాత్రమే అని చెప్పకనే చెప్పాడు. మరియు భార్యగా తన దృష్టిలో లహరి ఇంకా ప్రియలు ఉండాలని తన మనసులోని మాటను చెప్పాడు. ఇంకా ప్రియని బార్బీ డాల్ లా ఉంటారు అంటూ తెగ పొగిడేశారు. దీనితో శ్రీరామచంద్ర మనసులో ఇంట్లో ఉన్న అమ్మాయిల గురించిన  అభిప్రాయం ఏమిటో ప్రజలకు తెలిసింది. శ్రీరామచంద్ర రాముడు కాదని శ్రీకృష్ణుడు అని కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: