BIGG BOSS-5 : ష‌ణ్ణుకు లైవ్ లో ప్ర‌పోజ్ చేసిన దీప్తి..!

MADDIBOINA AJAY KUMAR
సోష‌ల్ మీడియాలో సెల‌బ్రెటీలుగా గుర్తింపు తెచ్చుకున్న వారికి ఎంతో మంది అభిమానులు ఉంటారు. ఇక వారు కూడా సినిమా తారల మాధిరిగా ఏం చేసినా వార్త‌ల్లో హైలెట్ గా నిలుస్తూ ఉంటుంది. అలాగే సోషల్ మీడియా స్టార్స్ గా గుర్తింపు తెచ్చ‌కున్న దీప్తి సునైనా, షణ్మ‌క్ జశ్వంత్ కూడా ఏం చేసినా అది హ‌ల్చ‌ల్ చేస్తుంది. ఇద్ద‌రూ ప్రేమించుకుంటున్నార‌నేది గ‌త కొంత కాలంగా సోషల్ మీడియాలోనే కాక మీడియాలోనూ ప్ర‌సారం అవ‌తున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఇద్దరూ ఒక‌రి పేరును మ‌రొక‌రు శ‌రీరం పై పచ్చ బొట్టును ముద్రించుకుని మ‌న‌సులో వారి ప్రేమ‌ను బ‌ద్ర‌ప‌రుచుకున్నారు. ఇక వీరి ప్రేమ వ్య‌వ‌హారం దీప్తి సునైనా బిగ్ బాస్ సీజ‌న్ 2 లో క‌నిపించిన నాటి నుండి మ‌రింత హాట్ టాపిక్ గా మారింది. 

దీప్తి అనేక సార్లు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న స‌మ‌యంలో ష‌ణ్ణు పేరును క‌ల‌వ‌రించింది. కాక‌పోతే నా బెస్టీ అంటూ కామెంట్లు చేసింది. ఇక హౌస్ లో దీప్తి మ‌రో ల‌వ్ ట్రాక్ న‌డుపుతుంది అనే అనుమానం రావ‌డంతో షణ్ణు కాస్త ఓవ‌ర్ గా కూడా రియాక్ట్ అయ్యాడు. ఆ త‌ర‌వాత అంతా ఆ షోలో ప‌రిస్థితుల వ‌ల్లే అని అర్థం చేసుకున్నాడు. ఇక బిగ్ బాస్ సీజ‌న్ 5 ఎంట్రీ ఇచ్చిన షణ్ముక్ జ‌శ్వంత్ ఇప్పుడు  దీప్తి పేరును క‌ల‌వ‌రిస్తున్నాడు. ఇటీవ‌ల ఓ ఇంటి స‌భ్యుడు కూడా నాగార్జున తో అదే విష‌యాన్ని చెప్పాడు. ష‌ణ్ణు చేతిపై డీ అనే అక్షరం ఉంద‌ని కూడా ఇంటి స‌భ్యులంతా ఏడిపిస్తున్నారు.

ఇక ఈ రోజు బిగ్ బాస్ సీజ‌న్ 5 కి సంబంధిచిన లేటెస్ట్ ప్రోమో విడుద‌ల కాగా రేపు  ష‌ణ్ముక్ పుట్టిన రోజు ఉన్న‌ట్టు క‌నిపిస్తుంది. అయితే బిగ్ బాస్ ష‌ణ్ముక్ బ‌ర్త్ డే ను గ‌ట్టిగానే ప్లాన్ చేశాడు. ఏకంగా ష‌ణ్మ‌క్ ప్రేయ‌సి దీప్తి సునైనా ను లైవ్ లోకి తీసుకువచ్చి ష‌ణ్ముక్ కు ప్రపోజ్ చేయించాడు. ష‌ణ్ణు ఐ ల‌వ్ యూ అని చెప్ప‌గానే బిగ్ బాస్ హౌస్ అంతా రొమాంటిక్ గా మారిపోయింది. మరోవైపు ఇప్ప‌టికే దీప్తి ష‌ణ్ముక్ జంట ప్రేమించుకుంటున్నారు అంటూ వార్త‌లు రాగా తాజాగా బిగ్ బాస్ ప్రోమోతో ఆ వార్త‌ల‌కు మ‌రింత బ‌లం చేకూరింది. ఇక బ‌హిరంగంగానే ప్ర‌పోజ్ లు చేసుకుంటున్న ఈ జంట పెళ్లి చేస‌కుని క‌ల‌కాలం కలిసి ఉంటుందా చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: