టీవీ: పోలీసుల అదుపులో అనసూయ..కారణం..?
ఇకపోతే ప్రస్తుతం పుష్పా సినిమాలో అనసూయ నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పోస్టర్లు కూడా లీక్ అయిన విషయం తెలిసిందే. ఇకపోతే తన అంద చందాలతో , నటనతో పక్క రాష్ట్రాల సినిమాలలో కూడా అవకాశాలు కొట్టేస్తోంది ఈ ముద్దుగుమ్మ. పక్కనున్న భాషలకు కూడా తన క్రేజ్ విపరీతంగా పాకింది. ప్రస్తుతం ఈమె పాత్ర నచ్చితే చాలు భాషతో అవసరం లేకుండా ఛాలెంజింగ్ పాత్రలలో కూడా చేస్తూ ప్రేక్షకుల మనసులని గెలుచుకుంటోంది. ఇక ఈ నేపథ్యంలోనే మలయాళంలో.. మలయాళ సూపర్ స్టార్ గా బిరుదు పొందిన మమ్ముట్టి చిత్రం ‘భీష్మ పర్వం’లో ఓ కీలక పాత్ర కోసం అనసూయను ఎంపిక చేసుకున్నారు.ఇక మరోవైపు మోహన్ లాల్ హీరోగా నటిస్తోన్న మరో సినిమాలో కూడా ఈ భామను ఎంపిక చేసారు.
ఇక ప్రస్తుతం తెలుగులో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రష్మిక హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక ‘పుష్ప’ లో అనసూయ భరద్వాజ్ కూడా ఒక కీలక పాత్రను పోషిస్తోంది. ఇక షూటింగ్లో భాగంగా అనసూయ పై కొన్ని జైలు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.ఇక్కడ అనసూయను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న కొన్ని సన్నివేశాలను పిక్చరైజ్ చేస్తున్నారు. అనసూయ జైల్ సీన్స్ ఈ సినిమాలో కీలకం అని చెబుతున్నారు..