నందమూరి నట సింహం
బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
బాలకృష్ణ , నందమూరి తారక రామారావు నట వారసుడిగా
సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో విజయాలను అందుకొని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తెలుగు సినీ పరిశ్రమలో సంపాదించుకున్నాడు. ఇకపోతే
బాలయ్య తాజాగా
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుల అఖండ 2 అనే సినిమాలో
హీరో గా నటించాడు. ఈ సినిమాలో సంయుక్త
మీనన్ హీరోయిన్గా నటించింది. ఈ
సినిమా కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న అఖండ
మూవీ కి కొనసాగింపుగా రూపొందింది. అలా అఖండ
మూవీ కి కొనసాగింపుగా రూపొందిన
సినిమా కావడంతో అఖండ 2
మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాను
డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే
డిసెంబర్ 5 వ తేదీన ఈ
సినిమా విడుదల కానుండడంతో ఈ
మూవీ అదిరిపోయే రేంజ్ ఓపెనింగ్స్ ను రాబడుతుంది అని
బాలయ్య అభిమానులు కట్టి నమ్మకంతో ఉన్నారు.
ఇకపోతే ఈ మధ్య కాలంలో
మూవీ లవర్స్ చాలా మంది సినిమాలు థియేటర్లలో చూడడానికి ఏ స్థాయిలో ఆసక్తి చూపిస్తున్నారో , ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో మూవీలను చూడడానికి కూడా అదే స్థాయిలో ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక
డిసెంబర్ 5 వ తేదీన
టాలీవుడ్ స్టార్
బ్యూటీ రష్మిక మందన ప్రధాన పాత్రలో నటించిన ది గర్ల్ ఫ్రెండ్ అనే
సినిమా నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ కానుంది. దానితో ఈ
సినిమా మంచి విజయం సాధించడంతో ది గర్ల్ ఫ్రెండ్
మూవీ ఓ టి టి విడుదల వల్ల
బాలయ్య హీరోగా రూపొందిన అఖండ 2
మూవీ ఓపెనింగ్స్ కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా అని అనుమానాలను కొంత మంది వ్యక్త పరుస్తున్నారు.