BIGG BOSS-5 : నేను తింటా.. తాగుతా.. తిరుగుతా..బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

MADDIBOINA AJAY KUMAR
బిగ్ బాస్ సీజ‌న్ 5 లో స‌భ్యులంతా డిఫ‌రెంట్ గానే ఉన్నారు. యాంగ్రీ మేనేజ‌మ్మెంట్ తో వ‌స్తే ఫ్యాన్స్ అవుతార‌ని అనుకున్నారో ఏమోగానీ ప్ర‌తీ ఒక్క‌రూ బీపీ పేషంట్ లా కొప్ప‌డిపోతున్నారు. వాళ్లు వీళ్లు అని తేడా లేకుండా హౌస్ లో దాదాపు అందరి ప‌రిస్థితి అదే విధంగా ఉంది. గ‌త సీజ‌న్ లో బిగ్ బాస్ హౌస్ అంతా రొమాంటిక్ గా ల‌వ్ ట్రాక్ లు కనిపించ‌గా బిగ్ బాస్ సీజ‌న్ 5 లో కొట్లాటలు గొడ‌వ‌లే ఎక్కువగా క‌నిపిస్తున్నాయి. ఇక హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అర్జున్ రెడ్డి న‌టి ల‌హ‌రి వ్యవ‌హారం చూస్తే అర్జున్ రెడ్డిలాగే అనిపిస్తుంది. గ‌ట్టి గ‌ట్టిగా అరుస్తూ హౌస్ దద్ద‌రిల్లేలా చేస్తుంది. మ‌రో వైపు ఉమా, శ్వేత వ‌ర్మ ల ప‌రిస్థితి కూడా అలానే ఉంది. 

మొన్న జెశ్వంత్ కూడా బీపీ పేషంట్ లా ప్ర‌వ‌ర్తించినా ఆ త‌రవాత వ‌చ్చిన ప‌రిణామాల వ‌ల్ల చ‌ల్ల‌బ‌డ్డాడు. ఇదిలా ఉంటే అర్జున్ రెడ్డి భామ ల‌హ‌రి అప్ప‌ట్లో ఓ మీడియా ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్య్వూ ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. అయితే ఈ ఇంట‌ర్య్వూ చూస్తే మాత్రం ల‌హ‌రి కంటెంట్ క్రియేట్ చేయ‌డం కోసం అర‌వ‌డంలేద‌ని త‌న యాటిట్యూడ్ అంతేన‌ని అర్థం అవుతోంది, ల‌హ‌రి ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంట‌ర్య్వూలో మాట్లాడుతూ...ఏ విష‌యాన్ని అయినా కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్ప‌డం త‌ను అల‌వాట‌ని ల‌హ‌రి చెబుతోంది. త‌న‌కు సినిమాలు టీవీ రెండూ ఇష్ట‌మేన‌ని చెబుతోంది.

తాను ఈటీవీ ద్వారా యాంక‌ర్ గా కెరీర్ మొద‌లు పెట్టాన‌ని ప్ర‌స్తుం ప‌దిహేను రోజులు సినిమాలు చేస్తే ప‌దిహేను రోజులు యాంక‌రింగ్ చేస్తాన‌ని చెప్పుకొచ్చింది. ఇక తాను అవకాశాల కోసం ఎప్పుడూ ప‌రిగెత్త‌లేద‌ని ఏ అవకాశం వచ్చినా చేశాన‌ని తెలిపింది. ఈటీవీలోకి వ‌చ్చిన కొత్త‌లో త‌నకు అవ‌కాశాలు వ‌చ్చినా ఫ్యామిలీ స‌మ‌స్య‌ల వ‌ల్ల వాటిని స‌ద్వినియోగం చేసుకోలేద‌ని వెల్లడించింది. ఇక అప్ప‌ట్లో తాను నైట్ డ్రైవ్ విత్ ల‌హ‌రి అనే షోను చేశాన‌ని తెలిపింది.

ఆ ఫోలో వ‌చ్చిన సెల‌బ్రెటీలు స‌మాధానం చెప్ప‌లేక‌పోతే వ‌డ్కా షాట్ తాగాల‌ని ఒక‌వేళ వాళ్లు స‌మాధానం చెబితే తాను వ‌డ్కా షాట్ తాగాల‌ని చెప్పింది. అయితే అది  వ‌డ్కా కాద‌ని షో కోసం క‌వ‌రింగ్ అని తెలిపింది. కానీ తాను వైన్ తాగుతాన‌ని నాన్ వెజ్ కూడా తింటాన‌ని చెప్పింది. తాము బ్రాహ్మిన్స్ అని అది చేయొద్దు ఇది చేయొద్ద‌ని అంటార‌ని కానీ త‌న కుటుంబం అలాంటి హ‌ద్దుల‌ను పెట్ట‌లేద‌ని ల‌హ‌రి స్ప‌ష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: