బిగ్ బాస్ లీక్స్: ఈ వారం నామినేషన్ లో ఉంది వీరే ?

VAMSI
బిగ్ బాస్ షో సీజన్ 5 ప్రారంభమై అప్పుడే వారం అయిపోయింది. ఏ టైమ్ లో అయినా ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా సీజన్ 5 ముచ్చట్లే. అంత ఎంటర్టైనింగ్ గా షో నడుస్తోంది. చిలిపి అల్లర్లు, సందడులు , చిన్న చిన్న గొడవలు ఆసక్తికర టాస్క్ ల మధ్య సీజన్ 5 ప్రేక్షకుల్ని అలరిస్తోంది. నిన్నటి ఎపిసోడ్ లో సరయు హౌస్ నుండి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. వెళ్తూ వెళ్తూ కొందరు ఇంటి సభ్యులకు ఓ రేంజ్ లో క్లాస్ ఇచ్చి కౌంటర్లు కురిపించి మరీ వెళ్ళింది. కొద్దిపాటిలో జస్వంత్ మరియు కాజల్ లు సేఫ్ కాగా సరయు ఎలిమినేట్ అయిపోయింది. అయితే ఇప్పుడు అందరి దృష్టి నెక్స్ట్ వీక్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్ళేవారు ఎవరా అన్న ఇంట్రెస్టింగ్ అంశంపై పడింది.
ఓటింగ్ ప్రేక్షకుల చేతుల్లోనే ఉన్నా ఓవరాల్ అభిప్రాయాన్ని ఎవరికి వారు అంచనా వేయటం కాస్త కష్టమే. అందుకే ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే ఈసారి నామినేషన్ లో ఉండబోయేది వీరేనంటూ కొన్ని మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ ఆ లిస్ట్ లో ఉన్న వారు వీరే అంటూ సోషల్ ఇండియాలో  హల్ చల్ చేస్తోంది. లిస్ట్ చూస్తే నటి ప్రియ, ప్రియాంక సింగ్, లోబో, నటరాజ్, ఆని మాస్టర్ మరియు ఆర్ జె కాజల్ లు నామినేషన్ లో ఉన్నట్లు సమాచారం.
ఈ రోజు ఎపిసోడ్ లో మళ్లీ నామినేషన్ ప్రక్రియ మొదలు కానుంది. కాబట్టి ఇంకొన్ని గంటల్లో ఈ వారం నామినేషన్ లిస్ట్ లో చేరబోయే ఇంటి సభ్యులు ఎవరా అన్న విషయంపై పూర్తి క్లారిటీ రానుంది. ఒకవేళ మనము అనుకున్నట్టు ఆర్ జె కాజల్ కనుక నామినేషన్ లో ఉంటే తప్పకుండా ఎలిమినేట్ అవుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఏమి జరగనుందో తెలియాలంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: