BIGG BOSS -5 :షణ్ముక్ కు గాజులు కూడా వేస్ట్..మూలకు కూసో..సరయు షాకింగ్ కామెంట్స్..!

MADDIBOINA AJAY KUMAR
బిగ్ బాస్ సీజ‌న్ 5 మొద‌ల‌వ్వ‌గా ఫ‌స్ట్ వీక్ లోనే ఓ రేంజ్ లో గొడ‌వ‌లు కుమ్ములాట‌లు మొద‌ల‌య్యాయి. ఇక గ‌త సీజ‌న్ ల‌లో ఇంటి స‌భ్యులు వెళుతుంటే ఎంతో ఎమోష‌న్ క‌నిపించేది కానీ ఈ సీజ‌న్ లో ఎక్కువ‌గా వారి మ‌ధ్య ఉన్న గొడ‌ల‌వే ఫోక‌స్ అయ్యాయి. ఇక బిగ్ బాస్ సీజ‌న్ 5 నుండి మొద‌ట ఎలిమినేట్ అయిన స‌ర‌యు బోల్డ్ పాప అరియానా గోరీకి బిగ్ బాస్ బ‌జ్ కోసం ఇంట‌ర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంట‌ర్వ్వూలో స‌రయు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. హౌజ్ లో ప‌లురువు స‌భ్యుల‌కు ఎన్నో అవ‌మానాలు జ‌రుగుతున్నాయంటూ స‌రయు కామెంట్లు చేసింది. ముఖ్యంగా లోబోను అస‌లు మ‌నిషిలా చూడ‌ర‌ని...రోబో అంద‌రి వాడ‌ని త‌న గేమ్ తాను అడుకుంటున్నాడ‌ని తెలిపింది. అత‌డిని ఓ ప‌నోడిలా బంటులా చూస్తున్నార‌ని అన్నీ బ‌రిస్తున్నాడ‌ని స‌ర‌యు వెల్ల‌డించింది. 

ఎలాంటి గ్రూపుల్లో కూడా లోబో లేడ‌ని తాను లోబో ఇద్ద‌రూ హౌస్ లోకి వెళ్లిన మొద‌ట్లో ఎంట‌ర్టైన్ చేశామ‌ని స‌ర‌యు వ్యాఖ్యానించింది. జెస్సీని సిరి హ‌న్మంత్ ఐదేళ్ల పిల్లాడిలా వాడుకుంటున్నార‌ని కామెంట్లు చేసింది. సిరి హ‌న్మంత్ పక్కా ఫేక్ అంటూ స‌ర‌యు కాంట్ర‌వ‌ర్షియ‌ల్ కామెంట్లు చేసింది. ఇక ష‌ణ్ముక్ జ‌శ్వంత్ అస‌లు ఆడ‌టం లేద‌ని అస‌లు మ‌గాడు అన్న విష‌యం మర్చిపోయాడు అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. మ‌గాడిలా ఆడ‌క‌పోయినా మ‌నిషిలా  అయినా ఆడు అంటూ స‌ల‌హా ఇచ్చింది.

తాను గాజులు వేసుకుని వెళ్లి ఆడాన‌ని షణ్ముక్ కు అవి కూడా వేసుకోవ‌డం వేస్ట్ అని సిరికోసం ఆడుతున్నాడంటూ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేసింది. షణ్ముక్ వెబ్ సిరీస్ లు చూసాన‌ని అత‌డికి ఎంతో ఫాలోయింగ్ ఉందని..అత‌డు హీరో అనుకుని వెళితే అక్క‌డ అంత సీన్ లేద‌ని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇక సిరి హ‌న్మంత్ త‌నకు మ‌గాళ్లంద‌రూ త‌న‌వైపే ఉండాల‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. మ‌గాళ్ల స‌పోర్ట్ ను సిరి హ‌న్మంత్ కోరుకుంటుంద‌ని స‌ర‌యు వ్యాఖ్య‌లు చేసింది. ఇక హౌస్ లో ఒకే ఒక్క మ‌గాడు ఉన్నాడ‌ని అత‌డు విశ్వ అని స‌ర‌యు వెల్ల‌డించింది. అత‌డు ఏడుస్తూ బాధ‌ప‌డుతూ త‌న ఆట తాను ఆడుతున్నాడ‌ని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: