సీరియల్స్ లో వాడే చీరలు ఎవరిస్తారు... వాటిని వాడేసిన తర్వాత ఏంచేస్తారో తెలుసా?

VAMSI
ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో సినిమాల దారి సినిమాలదే సీరియల్స్ దారి సీరియల్స్ దే. సినిమాల కంటే  సీరియల్స్ కి బాగా కనెక్ట్ అవుతారు మహిళలు. సీరియల్స్ అంటే చాలా ఆసక్తి కనబరుస్తుంటారు. ఒక్క రోజు కూడా మిస్ కాకుండా చూస్తుంటారు. సీరియల్స్ వాళ్ళు అక్కడ ఏడిస్తే ఇక్కడ మన కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. అంతగా కనెక్ట్ అయిపోతాము. సంవత్సరాలు తరబడి తీసే సీరియల్స్ లో నటీనటులు రోజుకో కొత్త డ్రెస్ లో దర్శనమిస్తుంటారు. మహిళలైతే ప్రతి రోజూ కొత్త కొత్త చీరలు కడుతుంటారు. రకరకాల నగలు పెడుతుంటారు. సీరియల్స్ లో నటీనటులు కట్టుకునే చీరలు సీరియల్ కి స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి. ఇదో పెద్ద ఇంటరెస్టింగ్ టాపిక్, వీరికి ఇన్ని చీరలు సీరియల్స్ వాళ్లే ఇస్తారా లేక వాళ్ళే సొంతంగా తెచ్చుకుంటారా  అని చాలా మందికి అనుమానం ఉంటుంది. 

ఒకసారి వాడిన చీరలను మళ్లీ ఏం చేస్తారు? అవకాశం వస్తే ఈ ప్రశ్నలను సీరియల్ వాళ్లని అడగాలని అనుకుంటారు కూడా, అయితే తాజాగా ఓ సీరియల్ నటికి ఇంటర్వ్యూ లో ఇదే ప్రశ్న ఎదురవగా అందుకు ఆమె ఏం సమాధానమిచ్చారంటే...!! జీ తెలుగులో ప్రసారమయ్యే గుండమ్మ కథ బాగా పాపులర్ అయ్యింది. ఈ సీరియల్ కి రేటింగ్ బాగానే వస్తుంది. జీ తెలుగులో వచ్చే ప్రముఖ సీరియల్స్ లో బాగా ప్రజా దరణ పొందిన వాటిలో  ఇది కూడా ఒకటి. ఇందులో గుండమ్మగా ప్రధాన పాత్రలో నటి గీత చేస్తుండగా, ఆమె చెల్లెలి క్యారెక్టర్ లో నటి మౌనిక నటిస్తున్నారు. అయితే తాజాగా నటి మౌనిక ఓ ఇంటర్వ్యూకి హాజరు కాగా ఆమెకు ఓ విచిత్ర మైన ప్రశ్న ఎదురయ్యింది. మీరు సీరియల్స్ లో రోజుకో చీర కడుతుంటారు.

అవి మీ చేరలేనా లేక ప్రొడక్షన్ వాళ్ళు ఇస్తారా? అలాగే ఒకసారి కట్టుకున్న చీరలను ఏం చేస్తారు అని యాంకర్ అడుగగా, అందుకు నటి మౌనిక ఏమన్నారంటే, "కొన్ని చీరలు మేమే తెచ్చుకుంటాము, డైరెక్ట్ గా షూటింగ్ కి చీరల్లో వచ్చేస్తాను కొన్ని ప్రొడక్షన్ వాల్లే ఇస్తారు అని సమాధానమిచ్చారు. ఇక ఒకసారి కట్టుకున్న చీరలు మళ్లీ కొద్ది రోజుల తర్వాత షూటింగ్ కి కోసం మళ్లీ వాడుతాము. అలా మళ్లీ మళ్ళీ ఇదే చేస్తాము అని చెప్పుకొచ్చారు మౌనిక. ఈ మాటతో ఎంతో మంది సీరియల్స్ చూసే మహిళల ప్రశ్నకు సమాధానం దొరికినట్టైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: