బిగ్ బాస్ 5: పబ్లిక్ గా లవ్ గురించి చెప్పిన షణ్ముఖ్ ?

VAMSI
కరోనా కారణంగా గత సంవత్సరం జరగాల్సిన బిగ్ బాస్ షో వాయిదా పడింది. అలా ఎన్నో అవాంతరాల నడుమ ఎట్టకేలకు బిగ్ బాస్ షో గ్రాండ్ గా మొదలయింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 స్టార్ట్ అయి ఈ రోజుకి సరిగ్గా వారం రోజులైంది.   మొత్తం 19 వివిధ రంగాలకు చెందిన వారు బిగ్ బాస్ హౌస్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. వారం రోజుల్లోనే బిగ్ బాస్ హౌస్ రణరంగంగా మారిపోయింది. తెలుగు ప్రేక్షకులు ఏదైతే ఊహించారో అలాగే ఇంటి సభ్యులు అన్ని రకాల హావభావాలతో ఎంటర్ టైన్ చేస్తున్నారు. నిన్న శనివారం కాబట్టి నాగార్జున వచ్చాడు. అందరినీ చాలా సరదాగా పలకరించి ఈ అయిదు రోజుల ఎలా గడిచింది అని పలు విషయాలు గురించి అడిగాడు. ఈ వారంలో ఎవరు మీకు బాగా సెట్ అయ్యారు ? అలాగే ఎవరు మీతో కట్ అయ్యారు ? అనే టాస్క్ ను నాగార్జున ఇచ్చారు. 
దీనితో ప్రతి ఒక్కరూ వారికి ఎవరితో బాగా సెట్ అయిందో అలాగే ఎవరితో కట్ అయిందో అని చెబుతూ వచ్చారు. వీరిలో కొంత మంది యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ తో మేము సరిగా కనెక్ట్ కాలేకపోయాము. మేము మాట్లాడాలని చూసినా అతని నుండి సరైన సహకారం లేదని చెప్పారు. దీనితో షణ్ముఖ్ పై  "నువ్వు ఎవ్వరితో మాట్లాడవు... ఎవరైనా మాట్లాడాలని వచ్చినా మాట్లాడవు" అని సెటైర్ వేశాడు నాగ్. ఇంతలోనే లహరి షణ్ముఖ్ బెడ్ పై రెండు పిల్లోలు పెట్టుకుని పడుకుంటాడని నాగార్జునతో చెప్పింది. దీనితో ఆ సీక్రెట్ ఏమిటో చెప్పమంటాడు. ఇంతలో ఎవరో గర్ల్ ఫ్రెండ్ ఇంకొకరు అని చెప్పగా, ఏం షన్ను... ఎవరా గర్ల్ ఫ్రెండ్ అని అలా అడిగాడో లేదో తక్కిన దీప్తి సార్ అని నోరు జారేశాడు.
దీనితో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఒక అమ్మాయి గురించి కోట్ల మంది చూస్తుండగా అలా డైరెక్ట్ గా చెప్పడం కరెక్ట్ కాదని అంటున్నారు. వీరు బయట లవర్స్ కావొచ్చు. కానీ ఇప్పుడు అతను పబ్లిక్ చూసే ఒక టీవీ షోలో ఉన్నాడు, కొంచెం నోరు జారకుండా ఉండి ఉంటే బాగుండేదని కామెంట్లు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: