BIGG BOSS-5 : విశ్వ ఒక్కడికే కండ‌లున్నాయా..నేను న‌లుగురిని లేపుతా..!

MADDIBOINA AJAY KUMAR
బిగ్ బాస్ లో మిగ‌తా ఇంటి స‌భ్యులకంటూ కండ‌లు ఉన్న‌వారికి కాస్త లాభాలు ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే బిగ్ బాస్ లో బుద్ధితో చేసే టాస్క్ లతో పాటు బలంతో చేసే టాస్క్ లు కూడా ఎక్కువే. ముఖ్యంగా ఫిజిక‌ల్ టాస్క్ లు ఇచ్చిన‌ప్పుడు ధృడంగా ఉన్న‌వాళ్ల‌కే టీం స‌భ్యులు కూడా అవ‌కాశం ఇస్తుంటారు. దాంతో ప్ర‌తి సీజ‌న్ లో కూడా హౌస్ లోకి ఓ కండ‌ల వీరుడు ఎంట్రీ ఇస్తుంటాడు. బిగ్ బాస్ మూడో సీజ‌న్ లో అలీ రెజా త‌న సిక్స్ ప్యాక్ బాడీతో యాంగ్రీ మేనెజ్మెంట్ తో ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాడు. ఇక అలాగే బిగ్ బాస్-4 సీజ‌న్ లో మెహ‌బూబ్ దిల్ సే త‌న ఫిట్నెస్ తో అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. అంతే కాకుండా మెహ‌బూబ్ తో టాస్క్ లో త‌ల‌ప‌డాలంటే హౌస్ మేట్స్ కూడా బ‌య‌ప‌డేవారు. 

ఇక ఫిజిక‌ల్ టాస్క్ లు ఏం వచ్చినా మెహ‌బూబ్ హౌస్ మేట్స్ కు చెమ‌ట‌లు ప‌ట్టించేవాడు. ఇక బిగ్ బాస్ సీజ‌న్ 5 లోనూ ఓ కండ‌ల వీరుడ్ని తీసుకువ‌చ్చారు. అతడే సీరియ‌ల్ న‌టుడు విశ్వ‌...నాగార్జున విశ్వ ఎంట్రీ ఇచ్చిన స‌మ‌యంలోనే అత‌డి ఫిట్నెస్ గురించి చెప్పి అంద‌ర్నీ ఆశ్చ‌ర్యప‌రిచాడు. అంతే కాకుండా ఇప్ప‌టికే డ‌బ్ల్యూ డ‌బ్ల్యూ ఈ రెజ్లింగ్ పోటీల ఆడిష‌న్స్ జ‌ర‌గ్గా తాను ఇండియా నుండి ఫైన‌లిస్ట్ గా ఉన్నాన‌ని చెప్పి అంద‌ర్నీ షాక్ కు గురిచేసాడు. ఇక నాగార్జున ఓ యాపిల్ పండు ఇవ్వ‌గా దాన్ని విశ్వ త‌న కండ‌ల మ‌ధ్య‌లో పెట్టి న‌లిపేశాడు. హౌస్ లోకి వెళ్లిన త‌ర‌వాత కూడా విశ్వ ఫిట్నెస్ కు అంద‌రూ ఫిదా అయ్యారు.

ఇక తాజాగా వ‌చ్చిన ప్రోమోలో విశ్వ క‌ల్ల‌కు గంత‌లు క‌ట్టుకుని ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ కోసం కుండ‌ల‌ను ప‌గ‌ల‌గొడుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. అయితే విశ్వ అది చేయ‌గ‌డ‌ని యాంక‌ర్ ర‌వి సూచించాడో ఏమో గానీ న‌ట‌రాజ్ మాస్టర్ ర‌విపై క‌స్సు బుస్సు లాడుతున్నాడు. హౌస్ లో విశ్వ‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడంటూ రవితో గొడ‌వ‌కు దిగాడు. విశ్వ ఒక్క‌డికే కండ‌లు ఉన్నాయా..నేను న‌లుగురిని లేపుతా అంటూ ఫైర్ అవుతున్నాడు. దాంతో ర‌వి ఇప్పుడు నేను చెప్ప‌టమే తప్ప‌య్యిందా మాస్ట‌ర్ అంటూ విసుక్కున్నాడు. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో వినాయ‌క చ‌విత సంధ‌ర్బంగా ఇంటిసభ్యులంతా క‌ల‌ర్ ఫుల్ దుస్తుల్లో మెరుస్తున్నారు. దాంతో ఫుల్ ఎంట‌ర్టైన్మెంట్ ఉంటుంద‌ని అర్థ‌మ‌వుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: