బిగ్ బాస్ 5: అమ్మా సిరి.. ఇది సీరియల్ కాదమ్మా?

VAMSI
తెలుగు సీరియల్స్ లో సత్తా చాటి బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో హౌస్ లోకి  అడుగుపెట్టిన తెలంగాణ అమ్మాయి సిరి. ఈమె తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు అని తెలుస్తోంది.  తన ఇండస్ట్రీ కెరీర్ లో ఇప్పటి వరకు 3 చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించింది. మరియు సిరి కున్న యూట్యూబ్ ఛానల్ "హే సిరి" ద్వారా కొన్ని వెబ్ సీరీస్ లను చేస్తూ ప్రేక్షకులకు చేరువైంది. ముఖ్యంగా సీరియల్స్ లోనూ మంచి పాత్రలను చేసి మహిళా ప్రేక్షకుల మనసులో చోటు దక్కించుకుంది. ఈమె బిగ్ బాస్ కు వెళ్ళక ముందు వరకు మొత్తం అయిదు సీరియల్స్ లో నటించింది.
ప్రస్తుతం సీరియల్స్ లో దక్కిన క్రేజ్ తోనే బిగ్ బాస్ లోకి దర్జాగా మొదటి పోటీ దారుగా అడుగు పెట్టింది. అయితే గడిచింది రెండు రోజులే అయినా సిరి మిగతా ఇంటి సభ్యుల మనసులో చోటు దక్కించుకుందా అంటే... లేదనే చెప్పాలి. నిన్న హౌజ్ లో సిరి మరియు జస్వంత్ కొందరి వస్తువులను దొంగిలించారు. మరి దీని వెనుక ఉద్దేశ్యం ఏదైనా, చేసింది కరెక్ట్ కాదనేది ప్రేక్షకుల అభిప్రాయం. ఈ సంఘటన అటు సిరి కి మరియు జస్వంత్ కు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. అంతే కాకుండా ఇంట్లో ఉన్న అందరి సభ్యుల కన్నా సిరికి కొంచెం ఆటిట్యూడ్ ఉండనే విషయం కూడా రాత్రి బహిర్గతం అయింది. అందరితోనూ మూవ్ కాకుండా కేవలం కొందరితోనే మాట్లాడుతుండడం కూడా ఇతరుల దృష్టిలో చెడుగా మారే అవకాశం ఉంది.
అంతే కాకుండా బిగ్ బాస్ లో ఆటిట్యూడ్ చూపిస్తే ఇతరులు ఎలా టార్గెట్ చేసుతరో అన్నదోయి గత సీజన్ లలో మనము చూశాము. కాబట్టి రాబోయే ఎపిసోడ్ లలో అయినా సిరి వైఖరి మార్చుకుంటుందా అన్నది చూడాలి.ఈమె స్వతహాగా సీరియల్ లో నటించింద్ కాబట్టి ఇంకా సీరియల్ మూడ్ వదిలినట్లు లేదు. సీరియల్ లో ఈమె ఇటీవల సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ లో విలన్ పాత్ర చేసింది. కాబట్టి ఇంకా ఆ పాత్ర నుండి బయటకొచ్చినట్లు లేదు అని కామెంట్స్ చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: