టీవీ : సుమ ప్రోగ్రాం లో పండు ఇంత పని చేశాడేంటి..?
ఢీ షోలో పండు తన డాన్సులతో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేస్తూ ఉంటాడు. పండు ఈ మధ్యకాలంలో కొన్ని చోట్ల లో కూడా ఎంట్రీ ఇస్తూ ఉన్నాడు. ఇక సుమా క్యాష్ ప్రోగ్రాం లో తమ తోబుట్టువులతో కొంతమంది హాజరయ్యారు. ఇక ఇందులో భానుశ్రీ, పండు,జాఫర్ , వంటి ఆర్టిస్టులు వచ్చారు. ఇక ఇందులో ఒకరికొకరు రాఖీ కట్టించుకుంటూ ఉండే సందర్భంలో.. పండుకు జాఫర్ సోదరితో రాఖి కట్టించడం వల్ల, ఆమె తనని అన్నయ్య అని పిలిచింది.
దాంతో పండు తన చేతిలోకి చెప్పు తీసుకొని చెంప మీద కొట్టుకున్నాడు. ఈ షో లో ఉండే వాళ్లంతా ఆ సందర్భాన్ని చూసి, నవ్వుకున్నారు. ఇక ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ గా మారుతోంది. ఇక వీరంతా ఎప్పుడూ తమ పాపులర్ కోసం ఇలాంటి పనులు చేయడం వల్ల ఈ వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. దీంతో ఈ షో కి టిఆర్పి రేటింగ్ లాంటివి ఎక్కువగా వస్తాయి ఉద్దేశంతోనే.. మల్లెమాల సంస్థ ఇలాంటి పనులు చేయిస్తూ ఉంటుందని నెటిజన్లు కామెంట్ రూపంలో తెలుపుతూ ఉన్నారు.
అంతేకాకుండా ఇంతకుముందు కూడా సుధీర్ రష్మీ, ఇమ్మాన్యూయేల్ వర్ష, వంటి వారికి వివాహం చేసి, తమ టీఆర్పీ రేటింగులు పెంచుకున్నారు.ఇలాంటి ప్రోమోలు ప్రేక్షకులకు ఆనందాన్ని ఇస్తాయి..