టీవీ : రవితేజ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన వంటలక్క..

Divya
వంటలక్క అలియాస్ ప్రేమీ విశ్వనాథ్.. కార్తీకదీపం సీరియల్ ద్వారా ఇటు ప్రేక్షకుల్లోనూ, అటు సెలబ్రెటీలలోను మంచి గుర్తింపు పొందింది. ఇక అంతేకాదు భారత దేశంలోనే అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధిస్తున్న ఏకైక సీరియల్ గా కూడా కార్తీకదీపం సీరియల్ నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఇదిలా ఉండగా వంటలక్క బుల్లితెరపై మంచి ఇమేజ్ ను సంపాదించడంతో , ఆ ఇమేజ్ తో ఇప్పుడు వెండితెరపై అడుగులు వేయడానికి సహాయపడుతుంది. త్వరలోనే వెండితెరపై దర్శనం ఇవ్వడానికి సన్నాహాలు సిద్ధం చేసుకుంటోంది. ఇక త్వరలోనే రవితేజ నటించబోయే మూవీ లో, ఈమె ఒక పాత్రలో నటించడానికి సిద్ధమవుతోంది. ఆ పాత్ర ఏమిటో..? దాని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
రవితేజ క్రాక్ మూవీతో 2021 సంవత్సరాన్ని గ్రాండ్ గా ఓపెన్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. దాదాపు సంవత్సరం పాటు కరోనాతో మూతపడిన థియేటర్ లన్నీ క్రాక్ మూవీతో ఒక్కసారిగా సందడి చేశాయి. ఇదిలా ఉండగా,  ఈ  సక్సెస్ తోనే ప్రస్తుతం రవితేజకు ఇంకొన్ని సినిమాలపై  సైన్ చేసే అవకాశాన్ని తెచ్చిపెట్టింది. ఇక రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఖిలాడి చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా, 2021 ఆగస్టు 28వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సత్యనారాయణ కోనేరు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. విలన్ గా అర్జున్ నటిస్తున్న విషయం తెలిసిందే.
అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఎవడో ఒకడు. ఇక ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీన విడుదల చేయడానికి సిద్ధమవుతోంది చిత్రం యూనిట్. ఇక మరొక చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. ఈ చిత్రంలో హీరోయిన్ గా మజిలీ హీరోయిన్  దివ్యాన్ష కౌశిక్ నటిస్తోంది. ఇక ఈ చిత్రం శరత్ మండవ దర్శకత్వంలో యాక్షన్ మూవీ గా తెరకెక్కుతోంది. ఇక ఈ చిత్రాన్ని కూడా ఇదే సంవత్సరం నవంబర్ 15వ తేదీన విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.
త్వరలో రవితేజ మరొక సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమాలో రాజీవ్ కనకాల కు భార్యగా , ఆయన పిల్లలకు తల్లి పాత్రలో నటిస్తోంది వంటలక్క.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: