టీవీ: ఆ వయస్సు వారికి అమెజాన్ బంపర్ ఆఫర్ ..
కరోనా మహమ్మారి తో ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీంతో ఆర్థిక సంస్థ కుదేలయింది. కరోనా తీవ్రత ఎక్కువ అవడంతో కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది. ఇక అంతే కాకుండా సినిమా హాళ్లు కూడా మూతపడ్డాయి. కరోనా తీవ్రత తగ్గడంతో ప్రభుత్వాలు లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత సినిమా హాల్ లు అన్నీ,50% తో నడవడం జరిగింది. కానీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఇప్పటివరకు సినిమా హాలు తెరవడానికి నోచుకోలేదు.
ఇక ఇలా ఉండడంతో మొత్తం సినిమా ప్రియులు ఓటిటి బాటపట్టారు. ఇదంతా అమెజాన్ ప్రైమ్ దృష్టిలో పెట్టుకొని.. ఒక కొత్త ఆఫర్ ను విడుదల చేసింది. అదేమిటంటే.. రూ.999 ఉన్న సంవత్సరం ఆఫర్ ని. కేవలం ఇప్పుడు 499 రూపాయల కే లభిస్తుందని అమెజాన్ ప్రైమ్ ప్రకటన చేసింది. ఈ ఆఫర్ ను కొన్ని షరతులతో విడుదల చేసింది అమెజాన్ ప్రైమ్.
అదేమిటంటే..18 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి ఇటువంటి ఆఫర్ ను ప్రకటించింది అని తెలిపింది అమెజాన్. ఈ ఆఫర్ లో amazon PRIME VIDEO, music లభిస్తాయి. ఈ ఆఫర్ ని ఎలా SUBSCRIBE చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఆఫర్ కావాలనుకునేవారు ముందుగా సంవత్సరం ప్లాన్ కొరకు 999 రూపాయలు చెల్లించాలి, ఆ తర్వాత ఏదైనా గుర్తింపు కార్డు (ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్) వంటి పత్రాలతో పాటు.. ఒక ఫోటో ఒకటి కూడా పంపించవలసి ఉంటుంది. మీరు పంపించిన సమాచారం నిజమైతే మీకు 500 రూపాయల క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు. అది నేరుగా మీ అకౌంట్ లోకి వచ్చి చేరుతుంది.
ఈ ఆఫర్ ను అతి చిన్న ప్యాక్ కు గా మూడు నెలలపాటు కూడా పొందవచ్చు. ముందుగా 329 రూపాయలు చెల్లించిన తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన వెంటనే.. రూ.165 క్యాష్ బాక్ ను పొందవచ్చు. ఈ ఆఫర్ ను కేవలం స్మార్ట్ఫోన్ వినియోగదారులకు మాత్రమే.