తెలుగులో వచ్చిన అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఇప్పటివరకూ సక్సెస్ ఫుల్ గా బిగ్ బాస్ నాలుగు సీజన్లు పూర్తయ్యాయి. కాగా గత మూడు సీజన్ల కంటే బిగ్ బాస్-4 కు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. అంతే కాకుండా ఆసియాలోనే ఎక్కువ రేటింగ్ వచ్చిందని నాగార్జున్ ఈ షోలో ప్రకటించారు. ఇక నాలుగో సీజన్ కు వచ్చిన క్రేజ్ తో నిర్వాహకులు వెంటనే సీజన్ 5 ను ప్రారంభించాలని భావించారు. కానీ కరోనా మహమ్మరి విజృంభనతో ఆలస్యం అవుతూ వస్తోంది. అయితే ఇప్పటికే కంటెస్టెంట్ ఎంపిక కూడా మొదలు పెట్టేసినట్టు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. లాక్ డౌన్ కారణంగా నిర్వాహకులు జూమ్ వీడియో కాల్స్ ద్వారా మాట్లాడుతూ కంటెస్టెంట్ లను ఎంపిక చేస్తున్నారట. ఇప్పటికే కొంతమందితో నిర్వాహకులు సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. వారిలో యూట్యూబ్ స్టార్ షణ్ముక్ జశ్వంత్, టిక్ టాక్ స్టార్ దుర్గారావ్, హాట్ హీరోయన్ పాయల్ రాజ్ పుత్, ఫోక్ సింగర్ మంగ్లీ, యాంకర్ వర్షిణి, ఆర్ జే చైతూ పేర్లు వినిపిస్తున్నాయి.
అంతే కాకుండా తాజాగా మరోపేరు తెరమీదకు వచ్చింది. కార్తీక దీపం సీరియల్ లో హీరోయిన్ గా నటించిన దీప అలియాస్ వంటలక్కను కూడా బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదించినట్టు తెలుస్తోంది. అన్నీ కుదిరితే వంటలక్క బిగ్ బాస్ ఎంట్రీ ఖాయమని తెలుస్తోంది. ఇదిలా ఉండగా వంటలక్క గా గుర్తింపు తెచ్చుకున్న దీప అసలు పేరు ప్రేమి విశ్వనాథ్. కార్తీక దీపం సీరియల్ సక్సెస్ లో ప్రేమి విశ్వనాథ్ ది మెయిన్ రోల్ అని చెప్పొచ్చు. ఆమె నటనకు ఎంతో మంది మహిళలు వీరాభిమానులు ఉన్నారు. అంతే కాకుండా సీరియల్ టైమ్ అయ్యిందంటే చాలు వంటలక్క కోసం టీవీల ముందు కూర్చునేవారు ఉన్నారు. ఇక అలాంటి వంటలక్క బిగ్ బాస్ ఎంట్రీ ఇస్తే ఏ రేంజ్ లో ఆమెకు సపోర్ట్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. అంతే కాకుండా మరికొందరు మహిళలు కూడా బిగ్ బాస్ కు అలవాటు పడతారు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఆమెను సంప్రదించినట్టు తెలుస్తోంది. మరి ఫైనల్ గా వంటలక్క బిగ్ బాస్ లో ఉందా లేదా అన్నది తెలియాలంటే సీజన్ మొదలయ్యేవరకూ వెయిట్ చేయాల్సిందే.