టీవీ : ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటున్న వంటలక్క.. ఏ పార్టీనో..

Divya

తెలుగు రాష్ట్రాలలో వంటలక్క (ప్రేమి విశ్వనాధ్) అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. అంతేకాకుండా ఈమె ఫాలోయింగ్ చూస్తే ఎవరికైనా దిమ్మతిరగాల్సిందే. స్టార్ హీరోలు, హీరోయిన్లకు కూడా దక్కని క్రేజ్ కార్తీకదీపం సీరియల్ తో అందిపుచ్చుకుంది మన దీపక్క.
ఇంట్లో ఒకరు ఇద్దరు అభిమానించడం కాదు ఇంటిల్లిపాది ఈమె అభిమానులే ఉండటంతో మన వంటలక్క ఆకాశాన్ని తాకేటట్టు ఉంది. ఇక విషయంలోకి వస్తే, కేరళకు చెందిన ప్రేమీ విశ్వనాథ్ తన సొంత రాష్ట్రమైన కేరళ రాజకీయాలపై అంత ఆసక్తి చూపడం లేదట.
తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈమె ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రెడీ అంటోంది. అయితే ఆమె సరదాగా చేసిన కామెంట్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. కార్తీకదీపం సీరియల్ లోకేషన్ కి  సంబంధించిన వీడియోలను యూట్యూబ్ ఛానల్ లో షేర్ చేస్తుండగా, తాజా వీడియోలో ప్రేమీ  విశ్వనాధ్,  ఈ సీరియల్ నిర్మాత గుప్తా వెంకటేశ్వరరావు సరదాగా ముచ్చట్లు పెట్టారు.
వీరు సంభాషణ  మొదట కరోనా, లాక్డౌన్ దగ్గర మొదలై,  మెల్లగా పొలిటికల్ వైపు వెళ్లింది. కేరళ లో మా పార్టీ బంపర్ విక్టరీ కొట్టింది అని చెప్పింది ప్రేమి విశ్వనాథ్. కేరళ మొత్తం ఫుల్ రెడీ అని అనడంతో.. మరి నీకు నెక్స్ట్ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా? అని అడిగారు నిర్మాత.'ఎమ్మెల్యే నా.. నాకు పొలిటికల్స్ ఇంట్రెస్ట్ లేదు సార్'అని చెప్పింది ప్రేమి. పోనీ కేరళ సంగతులు వదిలేయ్..
కనీసం ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పోటీ చేస్తావా? అని నిర్మాత అడగడంతో ..'హ టికెట్ ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా'.. అని చెప్పింది వంటలక్క. మరి ఏ పార్టీలో చేరుతావని అడిగితే, అది చేరినప్పుడు చెప్తానంటూ  తెలివిగా సమాధానం చెప్పింది వంటలక్క. ఆమె మాటలకు నిర్మాత తెగ నవ్వుకున్నారు..

ఏది ఏమైనా వంటలక్క ఫాలోయింగ్ చూస్తే ఎమ్మెల్యే ఏంటి? బంపర్ మెజారిటీతో గెలిచి మంత్రి కూడా అయిపోగలదు అన్నట్టుగా ఉంది ఆమె ఫాన్స్ ఫాలోయింగ్ చూస్తే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: