కార్తీక దీపం లో మరో ట్విస్ట్.. కంటతడి పెట్టిస్తున్న దీప..

Satvika
యావత్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న డైలీ సీరియల్ కార్తీక దీపం.. సీరియల్ స్టార్ మా లో అన్ని సీరియల్ లో కంటే అత్యధికంగా రేటింగ్ తో దూసుకుపోతుంది. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాలలో ఈ సీరియల్ కు ఉన్న అభిమానులు అంతా ఇంతా కాదు. ఇక ప్రస్తుతం ఈ సీరియల్ కాస్త కొత్తదనంతో ఉండటంతో మరింత ఆసక్తిగా మారింది. మొత్తానికి తనకున్న అనారోగ్య సమస్య గురించి తెలుసుకుంది దీప. దీంతో కార్తీక్ తో మరింత ప్రేమతో దగ్గర అవుతూనే.. పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తుంది.

ఇకపోతే కార్తిక్ కూడా దీప గురించి పిల్లల భవిష్యత్ ఎలాగో అని ఆలోచిస్తాడు..కట్ చేస్తే..వారణాసి రావడంతో కాసేపు కామెడీ పట్టిస్తారు. ఇక కార్తీక్ దీప విషయం గురించి ఆలోచిస్తాడు. ఇక వంటగదిలో పిల్లలు దోశలు వేయడం ఎలా ప్రయత్నించగా అవి కింద పడిపోవడం తో అరుస్తారు. వెంటనే కార్తీక్ అక్కడికి వెళ్లి పిల్లల్ని పంపించి తను దోసలు వేస్తాడు. ఇక కార్తీక్ దీపని నిద్ర లేపి కాఫీ ఇస్తాడు. ఇక దీప సంతోషం లో మునుగుతుంది. ఇక తనకు చిన్న చిన్న కోరికలు ఉన్నాయి.. అవి తీరకుండా పోతున్నాను.. ఓకే గ్లాసులోని కాఫీ ఇద్దరం కలిసి తాగాలని పెళ్లయినప్పటి నుంచి కోరిక అనగానే వెంటనే దీప చేతిలో కప్పు తీసుకొని తను కొంచెం తాగి దీపకి ఇస్తాడు.

అలా వారిద్దరి మద్య మళ్లీ ప్రేమ చిగురిస్తుంది.. ఎపిసోడ్ మొత్తం రొమాంటిక్ గా సాగుతుంది. రేపటి ఎపిసోడ్ లో సౌందర్య దీపని కలవడంతో.. దీనిపై ఇచ్చే విధానాన్ని అర్థం చేసుకొని విషయం తెలిసిందా అంటూ.. వాడు చెప్పేసాడా అంటూ.. నువ్విలా దిగులు చెందుతావని చెప్పలేక పోయాను అంటుంది సౌందర్య. ఇక దీప ఏడుస్తూ ఒకవేళ నేను పోతే నా పవిత్రత నిరూపించుకోకుండా పోతానా అత్తయ్యా అంటూ కన్నీరు పెట్టుకుంటుంది. దీంతో ఎపిసోడ్ మొత్తం ఎమోషనల్ అవుతుంది.. మరీ దీప నిజంగానే చనిపోతుందా అనే విషయం  ఆసక్తిగాx మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: