సీరియల్స్ లో నటిస్తున్న6 గురు సొంత అన్నదమ్ములు వీళ్ళే..!!

Mamatha Reddy
వెండితెర మీద ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ చాలా మంది హీరో లు తమ వారసులను సినిమా ఇండస్ట్రీ లో కి తీసుకు వచ్చారు.. దాన్నే నేపోటిజం అనే పేరుతో బాలీవుడ్ లో ఉద్యమం కొనసాగుతుండ గా, టాలీవుడ్ లో ఇప్పుడు దాని గురించి చర్చ మొదలైంది.. ప్రతి హీరో తన ఫ్యామిలీ మెంబర్స్ ల లో ఒకరిని ఇలా సినిమాల్లో కి తీసుకు రావడంతో కొత్త వారికి అవకాశాలు తక్కువ అవుతున్నాయ నే ఈ రకమైన వాదన రోజుకి ఎక్కువైపోతుంది.. కొన్ని రోజుల్లో ఇదో పెద్ద ఉద్యమంగా మారిన ఆశ్చర్యపోనవసరం లేదు..
అయితే వెండితెర మీదే కాకుండా బుల్లితెర పై న కూడా వారసుల హవా కొనసాగుతోంది.. బుల్లితెర పైన కొంతమంది నటులు తమ వారసులను నటులు గా, దర్శకులు గా మారుస్తూ వారిని ఇండస్ట్రీలో కొనసాగేలా చేస్తున్నారు.. అలా ఇండస్ట్రీ లో ఉన్న ఆరుగురు సొంత అన్నదమ్ములు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.. సావిత్రి గారి అబ్బాయి అనే సీరియల్లో ఇద్దరు బ్రదర్స్ బాలాదిత్య కౌశిక్ నటిస్తున్నారు బాలాదిత్య కొన్ని సినిమాల్లో కూడా నటించాడు.. అక్కడ సక్సెస్ లేకపోవడంతో బుల్లితెరపై కి అడుగులు వేసి ఇక్కడ రాణిస్తున్నాడు..
ఇక గోరింటాకు సీరియల్ లో నటిస్తున్న నిఖిల్ , కస్తూరి సీరియల్ లో హీరోగా చేస్తున్న నాగార్జున ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన సొంత అన్నదమ్ములు.. అలాగే కస్తూరి సీరియల్ లో హీరో తండ్రి వాసుదేవ్, రుద్రమదేవి సీరియల్ హీరో శ్రీధర్ ఇద్దరూ సొంత అన్నదమ్ములే.. అలాగే ప్రేమ ఎంత మధురం సీరియల్ ఫేమ్ వెంకట్, కృష్ణ ఇద్దరు బ్రదర్స్ అవుతారట.. కార్తీకదీపం హీరో నిరుపమ్,  నెంబర్ వన్ కోడలు లో హీరోగా నటిస్తున్న ధనుష్ ఇద్దరు అన్నదమ్ములు అవుతారట.. అలాగే నటుడు ఇంద్ర నీల్ అరవింద్ లు కూడా సొంత అన్నదమ్ములు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: