పర్సనల్ మ్యాటర్ ను లీక్ చేసిన అరియనా..!
ఇలా కెరీర్ సాఫీగా సాగిపోతోన్న సమయంలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతో చేసిన చిట్ చాట్‌తో విపరీతంగా ఫేమస్ అయింది. అతడి వల్లే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయిందీ.. సోషల్ మీడియా ద్వారా వర్మ ఈ బ్యూటీకి బాగానే టచ్ లో ఉన్నాడు. దీంతో అక్కడ బాగా ఫేమస్ ఆయన ద్వారా కొందరికి తెలిసింది. ఇప్పుడు బిగ్ బాస్ లో పాల్గొనడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ అమ్మడు పేరు మారు మోగి పోతుంది. నేను బోల్డ్ అమ్మాయిని. దేన్నైనా సాధించాలంటే వంద శాతం శ్రమిస్తా' అంటూ షోలోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో చెప్పింది ఆరియానా. అందుకు అనుగుణంగానే టాస్కుల్లో గెలవడం కోసం ఎంతటి పనైనా చేసేది.
హౌస్ లో అద్భుతమైన ఆటతీరుతో ఎన్నోసార్లు నామినేషన్లో ఉన్నా ఎలిమినేషన్స్ తప్పించుకని ఫినాలేకు చేరింది. కానీ, చివర్లో ఊహించని విధంగా నాలుగో స్థానంతోనే వెనుతిరిగింది .. 25 లక్షల వరకూ రెమ్యూనరేషన్ వచ్చింది. అదే సమయంలో వరుసగా ఆఫర్లు కూడా అందుకుంటోంది. సోషల్ మీడియాలో సైతం ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య పెరిగిపోయింది. దీంతో కొత్త యూట్యూబ్ చానెల్ కూడా ప్రారంభించింది. గత కొద్ది రోజులుగా ఈ అమ్మడు ఎక్కడా కనిపించలేదు. తన ఆరోగ్యం గురించి వెల్లడిస్తూ గుడ్ న్యూస్ చెప్పింది. 'నాకు జ్వరం వచ్చి పోయింది. నా కోసం ఆలోచించిన.. నా ఆరోగ్యం గురించి ప్రార్థించిన అందరికి థ్యాంక్స్' అంటూ వీడియోతో అసలు మ్యాటర్ ను రివిల్ చేసింది...