రెండు తెలుగు రాష్ట్రాల్లో వంటలక్క ఫ్యాన్స్ ఫుల్ సీరియస్.. పొద్దున్నే ఏంటిది అంటూ ఆగ్రహం

Mamatha Reddy
బుల్లితెర బాహుబలి గా పేరొందిన వంటలక్క సీరియల్ స్టార్ మా ఛానల్ లో గత నాలుగేళ్లుగా దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ డిజిటల్ యుగంలో కూడా వంటలక్క సీరియల్ ని ఎంతో శ్రద్ధగా క్రమం తప్పకుండా చూసే వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల కారణంగా ఇళ్లన్నీ నీటిమట్టం అయినా కూడా వంటలక్క సీరియల్ ని చూసిన వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. చిన్న, పెద్ద, ముసలి తారతమ్యం లేకుండా వంటలక్క సీరియల్ లో డాక్టర్ బాబు, వంటలక్క కు మధ్య జరిగే గొడవలను బాగా ఆస్వాదిస్తున్నారు.
ఒక రకంగా చెప్పాలంటే వంటలక్క సీరియల్ వీక్షించడం బుల్లితెర ప్రేక్షకులకు ఓ వ్యసనంలా మారింది. ఎంతగా అంటే ఆఫీస్ కి వెళ్ళే వారు కూడా ఉదయాన్నే లేచి వంటలక్క సీరియల్ చూస్తూ తమ పనులు చేసుకుంటున్నారు. అయితే గతంలో హాట్ స్టార్ అప్లికేషన్ లో ప్రతిరోజు ఉదయం 6:30 గంటలకు లేటెస్ట్ ఎపిసోడ్స్ అప్లోడ్ అయ్యేవి. కానీ కొద్ది రోజులుగా వంటలక్క సీరియల్ ఎపిసోడ్స్ చాలా ఆలస్యంగా అప్లోడ్ అవుతున్నాయి.తొమ్మిది, పది, పదకొండు ఈ విధంగా ఒక ఖచ్చితమైన సమయం అంటూ లేకుండా వంటలక్క సీరియల్ ఎపిసోడ్ లను హాట్ స్టార్ యాజమాన్యం తమ ప్లాట్ ఫాం పై అప్ లోడ్ చేస్తోంది.
దీంతో ఉదయాన్నే ఆఫీస్ లకు వెళ్లి రాత్రి సమయంలో ఇంటికి చేరుకునే వారు సీరియల్ ని చూడలేకపోతున్నారు. అందుకే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో లాగానే ఇప్పుడు కూడా లేటెస్ట్ ఎపిసోడ్ లను ఉదయాన్నే అప్ లోడ్ చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నారు. తనకెంతో ఇష్టమైన సీరియల్ యొక్క ఎపిసోడ్స్ చాలా ఆలస్యంగా అప్లోడ్ అవుతుండడంతో విసుగ్గా ఉందని ఒక వంటలక్క అభిమాని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మరి వంటలక్క అభిమానులను నిరాశ పరచకుండా ఎప్పటిలాగానే ఉదయాన్నే లేటెస్ట్ ఎపిసోడ్స్ హాట్స్టార్ అప్లికేషన్ అప్లోడ్ చేస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: