ఆల్రెడీ కమిట్.. అలా చేస్తే అయన ఫీల్ అవుతాడు.. శ్రీముఖి సంచలనం..?

P.Nishanth Kumar
ఒకప్పుడు బుల్లితెరను పట్టించుకునేవారే కాదు. ఎప్పుడో వారాంతంలో వచ్చే సినెమాలకోసమే టీవీ ని చూసేవారు ప్రేక్షకులు.. కానీ ఇప్పుడు రోజు వచ్చే షో లకోసం గంటలతరబడి వెయిట్ చేసి మరీ చూస్తున్నారు ప్రేక్షకులు..ముఖ్యంగా పొట్టి బట్టలతో అలరించే యాంకర్ కోసం మరీ మరీ వెయిట్ చేస్తున్నారట..  ఒకప్పుడు యాంకర్ ఒక్క సుమవైపే చూసేవారు.. కానీ ఇప్పుడు యాంకర్ ల అషన్స్ పెరిగిపోయాయి.. వాక్చాతుర్యంతో పాటు గ్లామర్ చూపించే యాంకర్స్ అందుబాటులో ఉండడంతో బుల్లితెర కలర్ఫుల్ గా కనపడుతుంది..

అనసూయ, రష్మీ, వర్షిణి ఇలా చాలామంది యాంకర్స్ లైం లైట్ లోకి వచ్చేసి యాంకర్అర్థాన్నే మార్చేస్తున్నారు. ఆలా బుల్లితెరపై దూసుకుపోతున్న టాప్ యాంకర్ శ్రీముఖి.  ప్రస్తుతం పలు షో లతో ఫుల్ బిజీ గా ఉన్నారు. గ్లామర్ తో తన అభిమానులను రెచ్చగొట్టే శ్రీముఖి బిగ్ బాస్ కి వెళ్లిన తర్వాత తనది వేరే లెవెల్ అని చెప్పొచ్చు.. ప్రస్తుతం పలు షో లతో బిజీ గా ఉన్న శ్రీముఖికి టీవీ షోస్‌ లేకపోయినా ఆన్‌లైన్‌ హోస్టింగ్‌ చేస్తూ కేక పెట్టిస్తుంది.

ఇకపోతే ఆమె బాయ్ ఫ్రెండ్ గురించి కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటూ ఆమె ఇచ్చిన హింట్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. స్టార్ట్ మ్యూజిక్ షోలో భాగంగా శ్రీముఖిని సుమ ఓ ప్రశ్న అడిగింది. అక్కడ కనిపిస్తున్నవారిలో ఏ హీరో అంటే ఇష్టమంటూ శ్రీముఖిని ఇరికించే ప్రయత్నం చేసింది సుమ. నాకు చిరంజీవి అంటేనే ఇష్టమంటూ బయటపెట్టేసింది శ్రీముఖి.ఎవరితో డేటింగ్‌కు వెళ్తావని శ్రీముఖిని మరో ప్రశ్న అడిగింది సుమ. అయితే ఆమె ప్రోమో కోసం అలా చెప్పిందో ఏమో గానీ శ్రీముఖి చేసిన కామెంట్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి. ఆల్రెడీ కమిటెడ్.. ఇప్పుడు నేను ఇలా డేటింగ్‌కు వెళ్తే ఆయన ఫీలవుతాడు. నా కంటూ కొన్ని నియమాలున్నాయ్ అంటూ శ్రీముఖి బాంబ్ పేల్చింది. అయితే ఈ వ్యాఖ్యలు కామెడీగా చేసిందా? లేదా నిజంగానే అందా? అన్నది తెలియాలంటే ఈ షో చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: