డ్రాగన్:గ్లింప్స్ తో విధ్వంసం సృష్టిస్తున్న ఎన్టీఆర్..!
నాలుగు నిమిషాల నిడివి కలిగి ఉన్న ఒక గ్లింప్స్ విడుదల చేయగా ఇందులో ఎన్టీఆర్ గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా పవర్ఫుల్ లుక్ లో కనిపించారు. ఈ గ్లింప్స్ ఎన్టీఆర్ అభిమానులకు పూనకాలు తెప్పించేలా కనిపిస్తోంది. ఈ సినిమా 2027 జూన్ 11న విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా స్టోరీ స్వాతంత్రం ముందు బ్రిటీష్ వాళ్ళు ఇండియాకు రావడంతో ప్రారంభమవుతుంది. 1967 నుంచి ఈ సినిమా కథ మొదలవుతుంది. ముఖ్యంగా ఓపియం పాపి అనే మొక్క నుంచి ఈ సినిమా స్టోరీ మొదలవుతున్నట్లుగా గ్లింప్స్ లో చూపించారు.
ఎన్టీఆర్ లూగర్ పాత్రలో కనిపించబోతున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ బ్యాక్గ్రౌండ్ అందించిన బిజిఎం కూడా అదిరిపోయేలా ఉంది. అలాగే ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ "దేవుడు నాకు గొప్ప వరం ఇచ్చాడు. ట్రిగర్ నొక్కగానే మర్చిపోవడం, నిద్ర పోయినప్పుడు నేను చంపిన వాళ్ళ ముఖాలు నా కలలోకి రావు. మిగిలిన శత్రువుల ముఖాలే నాకు కనిపిస్తాయి, పొరపాటున కూడా నువ్వు నా కలలోకి రావద్దు " అంటూ చెప్పే డైలాగ్ ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంది. మొత్తానికి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమా మీద మరింత అంచనాలు పెంచేసేలా చేశారు. వాస్తవానికి ఈ సినిమా ఈ ఏడాది విడుదల కావాల్సి ఉండగా సినిమా షూటింగ్ వాయిదా వల్ల వచ్చేయేడానికి విడుదల చేయబోతున్నారు.