హమ్మ ..చమ్మక్ చంద్ర..ఇన్ని కోట్ల ఆస్తి ఎలా కూడబెట్టడబ్బా..?

Mamatha Reddy
చమ్మక్ చంద్ర ఆస్తి ఎంతో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం..

ప్రముఖ హాస్యనటుడు చమ్మక్ చంద్ర గురుంచి తెలియని తెలుగు ప్రేక్షకులు ఎవరూ ఉండరు అంటే అతిశయోక్తి కాదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న ఆయన అనేక సినిమాల్లో కూడా నటించి మెప్పించారు. ఫ్యామిలీ స్కిట్స్ లతో ప్రముఖ దర్శకులు, నటులను సైతం చంద్ర ఫిదా చేశారు. చంద్ర అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ కి మహా ఇష్టం అని అంటుంటారు. అందుకే ఆయన తన సినిమాల్లో చంద్ర కి అవకాశాలు ఇస్తూ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. మిగిలిన డైరెక్టర్లు కూడా చంద్ర కి సినిమా అవకాశాలు ఇచ్చి బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. మొన్నీ మధ్య తెరకెక్కిన "అల్లుడు అదుర్స్" సినిమాలో కూడా చమ్మక్ చంద్ర నటించి మెప్పించారు. ఆయన వెండితెరపై ఇప్పుడిప్పుడే ఫుల్ టైం కమెడియన్ అవుతున్నారు.

అయితే ఈ నేపథ్యంలోనే మెగా బ్రదర్ నాగబాబు చెప్పారని ఆయన జబర్దస్త్ షో ని వదిలేసి జీ తెలుగులో ప్రారంభించిన అదిరింది షో కి వెళ్లారు. కానీ అదిరింది షో ప్లాప్ అయ్యింది. దీనితో జీ తెలుగు యాజమాన్యం బొమ్మ అదిరింది షో ని ప్రారంభించింది. అది కూడా సక్సెస్ కాలేక పోవడంతో మొత్తానికే అన్ని కామెడీ షో లను నిలిపివేశారు. దీంతో ప్రస్తుతం చంద్ర స్టార్ మా లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ లో నవ్విస్తున్నారు.

ఇదిలా ఉండగా జబర్దస్త్ లో మోస్ట్ వాల్యుయేబుల్ కమెడియన్ గా చంద్ర పేరు తెచ్చుకున్నారు. ఆయన చేసిన ప్రతీ స్కిట్టు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. సోషల్ మీడియాలో చంద్ర స్కిట్లు వైరల్ గా మారేవి. అయితే ఆయన టాలెంట్ కు తగ్గట్టుగా జబర్దస్త్ యాజమాన్యం రెమ్యూనరేషన్ ఇచ్చారట. అంతేకాదు  జీతెలుగు యాజమాన్యం ఒక్క ఎపిసోడ్ కి రూ. 4 లక్షలు ఇచ్చిందట. దీన్ని బట్టి చూస్తుంటే చంద్ర కి బాగా డిమాండ్ ఉందని తెలుస్తోంది. అయితే నటన రంగంలో అడుగుపెట్టిన తర్వాత చంద్ర పక్కా ప్లానింగ్ తో చాలా డబ్బులు వెనకేసారని తెలుస్తోంది. ఆయనకు హైదరాబాదులో కోట్లు విలువ చేసే సొంత ఇల్లు కూడా ఉంది. ఓ బీఎండబ్ల్యూ కార్ తో పాటు హైదరాబాద్ నగరంలో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. అలాగే తన సొంత గ్రామంలో కూడా చంద్ర చాలా పొలాలు కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఏది ఏమైనా జబర్దస్త్ నుంచి చంద్ర బయట అడుగుపెట్టినా ఆయన్ని ఆరాధించే అభిమానులు లక్షల మంది ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: