వంటలక్క ఆస్తుల లెక్కలు చూసి బిత్తరపోవాల్సిందే..హీరోయిన్స్ కూడా వేస్ట్

Mamatha Reddy
వంటలక్క .. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులర్. తనపై ఉన్న అనుమానాల్సి తొలగించి డాక్టర్ బాబు నమ్మకాన్ని తిరిగి సంపాదించాలనుకునే వంటలక్క పాత్ర... అందరికీ సుపరిచితమే. అటు ఆత్మాభిమాన్ని వదులుకోకుండా తన ఉనికిని కాపాడుకునే పాత్ర. బుల్లితెరపై సంచలనాలకు మారుపేరయిన కార్తీక దీపం సీరియల్ లోని ఈ పాత్రను మళయాళ నటి ప్రేమీ విశ్వనాథ్ పోషిస్తున్నారు.
టీఆర్పీపరంగా చూసుకున్నా కార్తీక దీపం నెంబర్ వన్ గా దూసుకుపోతుంది. కొన్ని ఏళ్లుగా ఇదే  టాప్. వరదలొచ్చినా.. ఇళ్లు మునిగిపోయినా.. కార్తీక దీపం సీరియల్ మాత్రం చూడటం వదిలిపెట్టరు తెలుగు ప్రేక్షకులు. ఇంకో విషయం ఏంటంటే.. ఇంట్లో ఆడవాళ్లు, మగవాళ్లు, పిల్లలు అన్న తేడా లేకుండా ఈ సీరియల్ ని ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ సీరియల్ లో వంటలక్క పాత్రకు మామూలుగా పేరు రాలేదు. ఈ మళయాళీ ముద్దుగుమ్మకు వచ్చిన పేరు అంతా ఇంతా కాదు. ఈమె ఇప్పుడు వెండితెరపై అరంగేట్రం చేసేందుకు సిద్ధమైంది. ఈమెకున్న క్రేజ్ చూసి దర్శకులు ఆమె డేట్స్ కోసం ఎగబడుతున్నారట. వంటలక్క త్వరలోనే వెండితెరపై కూడా మెరవబోతోందని సమాచారం
ఈ విషయాన్ని ప్రేమీ విశ్వనాథ్ స్వయంగా చెప్పింది. ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రేమీ కనిపించనుంది. లాక్ డౌన్ లేకపోయి ఉంటే ఈ పాటికే సినిమా విడుదలై ఉండాల్సింది. కరోనాతో షూటింగ్ కి బ్రేక్ పడటంతో ఇప్పుడు మళ్లీ షూటింగ్ లో పాల్గొంటుంది ప్రేమీ. ఆమె సినిమాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రేమీ విశ్వనాథ్ రెమ్యునరేషన్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. కార్తీక దీపం ఒక్కో ఎపిసోడ్ కి లక్షకు పైగా తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. మళయాళ సినిమాల్లోనూ లక్షల్లోనే పారితోషం తీసుకుంటుంది. ఇక ఆమె ఆస్తుల చిట్టా గురించి మాట్లాడుకుంటే.. 2020 లెక్కల ప్రకారం 36 కోట్లకు పైగానే ఆమెకు ఆస్తులు ఉన్నాయని తెలుస్తుంది. సీరియల్స్ లో నటించే ఇంత సంపాదించిందా అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: