బుల్లి తెర మెగాస్టార్ “ప్రభాకర్” కూతురు గురించి ఈ విషయాలు తెలుసా.?
అంతేకాదు అప్పట్లో ప్రభాకర్ ఈ టీవీకి క్రియేటివ్ మేనేజర్ గా కూడా వ్యవహరించారు. తరువాత కొన్ని విబేధాల కారణంగా ఈటీవీ లో నటించడం మానేశారు. ప్రభాకర్ జగడం అనే ఒక డాన్స్ రియాల్టీ షో లో కూడా పార్టిసిపేట్ చేశారు.అలాగే సినిమాల్లో నటిస్తునే చాలామందికి డబ్బింగ్ చెప్తూ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఇంకా ప్రభాకర్ వ్యక్తిగత విషయానికి వస్తే తన భార్య పేరు మలయజ.ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. అలాగే ప్రభాకర్, మలయజ ఇద్దరు కలిసి మా టీవీ లో ప్రసారమయ్యే ఇస్మార్ట్ జోడి ప్రోగ్రాంలో పాల్గొన్నారు.
అలాగే ప్రభాకర్ కూతురు పేరు దివిజ. తాను కూడా ఒక సీరియల్ లో నటించింది. అన్నా చెల్లెళ్ళు అనే సీరియల్ లో నటించింది. అంతేకాదు ఈ సీరియల్ లో తన నటనకు నంది అవార్డు కూడా అందుకుంది. దివిజ ప్రస్తుతం యూట్యూబ్‌లోకి అడుగుపెట్టింది. మోడ్రన్ మహానటి పేరు మీద ద మిక్స్ అనే చానల్ ద్వారా వారానికి ఒక ఎపిసోడ్ రిలీజ్ చేస్తుంది. తమాడా మీడియా ద్వారా ఇప్పటికే కొన్ని ఎపిసోడ్లు రిలీజ్ అయ్యాయి.అవి కూడా మంచి వ్యూస్ సంపాదిస్తున్నాయి. దివిజ నటన అందరిని ఆకట్టుకుంటుంది. భవిష్యత్తులో మరిన్ని మంచి ప్రోగ్రామ్స్ చేసి తండ్రికి తగ్గా కూతురుగా పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం.. !!