యాంకర్ శ్రీముఖికి ఘోర అవమానం..కన్నీళ్లు పెట్టుకొని..!

Mamatha Reddy
హీరో నవదీప్ అంటే తెలియని వారు ఉండరు. ఒకప్పుడు కొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు.అలాగే కొన్ని సినిమాల్లో హీరోకి ఫ్రెండ్ గా, విలన్ గా కూడా నటించాడు. కానీ తరువాత సినిమాల్లో అవకాశాలు రాకనో మరే కారణం చేతనోగానీ సినిమాల్లో కనిపించడం మానేసాడు. అయినాగానీ బుల్లితెరలో మాత్రం సందడి చేస్తూ అందరిని అలరిస్తున్నాడు. అలాగే నవదీప్ కి అమ్మాయిల  ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువగానే ఉంది.  ఈ మధ్య జీ తెలుగులో ప్రసారం అయ్యే అదిరింది షో కి జడ్జి గా కూడా వ్యవహరిస్తున్నాడు. తనదైన శైలిలో పంచ్ లు వేస్తూ,ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేస్తున్నాడు. నవదీప్ అక్కడితో ఆగిపోలేదు అండి. పండగల సందర్భంగా స్పెషల్ ఈవెంట్లతో సందడి కూడా చేస్తున్నాడు. నవదీప్ ఉంటే చాలు ఆ జోష్ వేరేలా ఉంటుంది కదా..  
ఇప్పటికే దసరా ఈవెంట్ కు సంబంధించి ఈటీవీలో నవదీప్ అదరగొట్టేసిన విషయం తెలిసిందే.  ఇప్పుడు సంక్రాంతికి "జీ "తెలుగులో మళ్ళీ మనముందుకు  రాబోతున్నాడు.  తాజాగా జీ తెలుగులో సంక్రాంతి సంబరాలు ఈవెంట్‌లో హీరో రామ్, నవదీప్ స్పెషల్ గెస్ట్‌లుగా వచ్చారు. ఇందులో నవదీప్ తన దైన రీతిలో తెగ రెచ్చిపోయాడు.ఆ షో  యాంకర్లను ఒక  రేంజ్‌లో ఆడేసుకున్నాడు. ముఖ్యంగా యాంకర్ శ్రీముఖిపై పంచ్‌ల వర్షం కురిపించాడు. దీంతో శ్రీముఖి కి అనుకోని షాక్ తగిలిందనే చెప్పాలి. అయితే నవదీప్ తో కలిసి పలుమార్లు ఈవెంట్స్ లో పాల్గొన్న శ్రీముఖి ఈ సారి మాత్రం నవదీప్ తన మీద వేసిన సెటైర్స్ కి తన ముఖం మాడిపోయింది. ఈసారి కొత్త నవదీప్ ను చూస్తున్నట్లు ఉంది అని షో చుసిన వాళ్లు అనుకోకుండా ఉండలేరు. నవదీప్ రావడంతోనే యాంకర్ శ్రీముఖిని ఉద్దేశిస్తూ సెటైర్లు వేశాడు. కానీ శ్రీముఖి తన సహజ స్టైల్ కు తగ్గట్టుగానే హీరో నవదీప్‌పై ఒదిగిపోయింది.
 
అప్పుడు శ్రీముఖి అమ్మ బాబోయ్ ఇలా కనెక్ట్ అయిపోతున్నానేంటి? అని శ్రీముఖి కౌంటర్ వేసింది.దానికి  ఇంకెవరైనా అవుతారా? అని చూస్తున్నా నేను అంటూ రివర్స్ కౌంటర్ వేసేశాడు నవదీప్.  దీంతో శ్రీముఖి మొఖం మాడిపోయింది. అంతేకాదు నేను అలిగాను, బుంగమూతి పెట్టుకున్నాను అని శ్రీముఖి అనగానే.. బుంగమూతా? బొంగుమూతా? అని నవదీప్ రివర్స్ కౌంటర్ వేశాడు. లైఫ్‌లో నీకు  ఎవరైనా మరదళ్లు ఉన్నారా? అని శ్రీముఖి అంటే.. ఓ మరదలు ఉందని నవదీప్ అంటాడు. అవునా... ఎవరు అని శ్రీముఖి వెరైటీగా అడిగింది. ఇంకెవరు మావయ్య కూతురు అని మళ్లీ ఓ పంచ్ వేస్తాడు.. దీనితో శ్రీముఖి సైలెంట్ అయిపోయింది. ఈ షో లో శ్రీముఖి ని ఒక రేంజ్ లో ఆడుకున్నాడు నవదీప్. నవదీప్ లో వచ్చిన ఈ మార్పును చుసి శ్రీముఖి షాక్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: