అనసూయకు కరోన సోకిందా..?

yekalavya
ఇంటర్నెట్ డెస్క్: బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ కరోనా బారిన పడ్డారనే వార్త ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై అనసూయనే స్వయంగా ట్వీట్ చేయడంతో దుమారం రేగుతోంది. అయితే అనసూయ తన ట్వీట్‌లో చెప్పిన దాని ప్రకారం.. ఆమెకు కరోనా సోకలేదు. అయితే కరోనా లక్షణాలు మాత్రం కనబడుతున్నాయి. ఈ విషయాన్నే ఆమె తన ట్విటర్‌లో పేర్కొన్నారు. "ఈరోజు ఉదయమే కర్నూలు బయలుదేరడానికి సిద్ధమయ్యాను. అయితే నాలో కరోనా లక్షణాలు ఉన్నట్లు అనిపించడంతో ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాను. నా టెస్ట్‌ రిజల్ట్స్‌ గురించి తెలియజేస్తాను. రీసెంట్‌గా నన్ను కలిసిన వారందరూ ఓసారి టెస్ట్‌ చేయించుకోండి" అంటూ అనసూయ ట్వీట్‌ చేసింది.

లాక్‌డౌన్‌ సడలించి, నిబంధనలతో కూడిన పరిమితులు ఇవ్వడంతో టాలీవుడ్‌ సెలబ్రిటీలు షూటింగ్స్‌, సెలబ్రేషన్స్‌లో పాల్గొంటున్నారు. తగు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నా సినీ ఇండస్ట్రీలో అనేకమంది కరోనా బారిన పడ్డారు. మెగా ఫ్యామిలీ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్‌తేజ్, మెగా బ్రదర్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్‌లు వరుసగా కరోనా బారిన పడ్డారు.

వీరు మాత్రమే కాకుండా రాజమౌళి, దర్శకుడు క్రిష్, తమన్నా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వంటి అనేకమంది సెలబ్రిటీలు, సినిమా సిబ్బంది ఈ మహమ్మారి బారినపడ్డారు. బాలీవుడ్‌లో అయితే అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఆమె తనయ ఆరాధ్య అందరూ కరోనా బారిన పడి కోలుకున్నారు. దీంతో అనేక సినిమాల షూటింగ్‌లు వాయిదా పడ్డాయి.

ఇదిలా ఉంటే తెలుగులో జబర్దస్త్ కామెడీ షో యాంకర్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ ఒక వైపు సినిమాలు.. మరోవైపు టీవీ షోలతో ఫుల్‌ బిజీగా
గడుపుతోంది. టీవీ షోలు మాత్రమే కాకుండా క్షణం, రంగస్థలం, కథనం వంటి హిట్ సినిమాల్లో కూడా గుర్తింపు ఉన్న పాత్రల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అనసూయ కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న రంగమార్తాండ మూవీలో నటిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: