రవి-లాస్యల కలయిక సుధీర్-రష్మీల జోరు తగ్గిస్తుందా?
మరోవైపు పెళ్లి చేసుకున్న లాస్య కొన్నేళ్లపాటు కెమెరాకు దూరంగా ఉంది. లాంగ్ గ్యాప్ తర్వాత ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా మరోసారి బుల్లితెరపై సందడి చేసింది. హౌస్లో సందడి చూస్తే ఏ మాత్రం ఎనర్జీ తగ్గలేదని, అలాగే ఆడియన్స్లో ఆమెకున్న పాపులారిటీకి చిన్న మచ్చ కూడా పడలేదని అర్థమైంది. ఈ క్రమంలోనే దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ కొత్త సంవత్సరం వేళ రవి, లాస్య ఒక్కటైనట్టు కనిపిస్తోంది. ఫ్రెండ్ షిప్ బ్యాండ్లతో ఇద్దరూ దర్శనమిచ్చారు. టామ్ అండ్ జెర్రీ బ్యాక్ అంటూ రవి పోస్ట్ చేయడం ఆడియన్స్ ని హుషారెత్తించింది. దీంతో రవి, లాస్య మళ్లీ బుల్లితెర ప్రయాణం స్టార్ట్ చేయబోతున్నారనే చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో అందరూ అనుకున్నట్లే వీళ్ళిద్దరితో 'ఫ్యామిలీ పార్టీ' అనే స్పెషల్ ప్రోగ్రాం ప్లాన్ చేశారు. సంక్రాంతి సందర్భంగా ఈ షో టెలికాస్ట్ కానుంది. ఈ స్పెషల్ షోలో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. తాజాగా దీని తాలూకు ప్రోమోని యాంకర్ రవి షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఇది చూసి ఇక బుల్లితెరపై యాంకర్ల జోడీల మధ్య గట్టి పోటీ ఖాయం అని చెప్పుకుంటున్నారు జనం. ముఖ్యంగా సుధీర్- రష్మీ జోడీతో, రవి- లాస్యల జోడీకి మంచి కాంపిటేషన్ ఉంటుందని అంటున్నారు. ఇక మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన రవి-లాస్యల జోడీ వల్ల సుదీర్ – రశ్మీల జోడీకి ఎలాంటి పోటీ ఎదురుకానున్నదనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాలి.