మాస్టర్ బండారం బయట పెట్టిన భార్య.. నిజంగా అలా జరిగిందా?
అయితే వీరందరిలో కన్నా కూడా అమ్మా రాజ శేఖర్ మాస్టర్ కాస్త డిఫరెంట్.. ఎందుకంటే ఆయన చిన్న పిల్లాడి మనస్తత్వం.. చిన్నదానికి కూడా ఎక్కిళ్ళు పట్టి ఏడుస్తాడు.. కానీ చాలా హార్డ్ వర్క్ ఉన్న మనిషి.. అందుకే ఇప్పటి వరకు చాలా మంది చేత ప్రశంసలు అందుకున్నారు. ఈ సీజన్ లో మాస్టర్ కు ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది. ఈ ఎపిసోడ్ గెలవడం ఖాయం అంటున్నారు టీవీ ప్రేక్షకులు..బిగ్ బాస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ లలో ఒకరు అమ్మా రాజ శేఖర్ మాస్టర్..
ఇది ఇలా ఉండగా ఇప్పుడు మాస్టర్ గురించి మరో వార్త చక్కర్లు కొడుతుంది. ఆయన ఈ షో లో ఎలాగైనా గెలవాలని తన భార్య రాధ పలు టీవీ షోలలో , యుట్యూబ్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తుంది.తాజాగా ఓ ఇంటర్వ్యూ లో చెప్పిన వ్యాఖ్యలు మాత్రం అందరిని కంటతడి పెట్టించింది. అదేంటంటే..రాజ శేఖర్‌కి అమ్మ అంటే ప్రాణం.. అందుకే తన పేరు ముందు అమ్మా అనే పేరుని కూడా యాడ్ చేసుకున్నారు. రాజ శేఖర్ అమ్మా రాజశేఖర్ అయ్యింది తన తల్లిపై ఉన్న ప్రేమతోనే.
అయితే ఆయన ఎదుగుదలకే కాదు.. ఆయన కెరియర్ పరంగా దెబ్బతినడానికి, ఆస్తులు పోగొట్టుకోవడానికి కూడా ఆ ‘అమ్మ’ కారణం అంటుంది రాజ శేఖర్ భార్య రాధ.ఆయన జీవితం ఒక విధంగా తల క్రిందులుగా మారడానికి కారణం కూడా వాళ్ల అమ్మే కారణం..రియల్ లైఫ్‌లో కూడా ఆయన చాలా ఎమోషనల్. సెన్సిటివ్.. ఒకర్ని నమ్ముతారు వాళ్ల దగ్గర తేడా వస్తే అస్సలు తట్టుకోలేరు. బిగ్ బాస్ హౌస్‌లో కూడా అలాగే ఉంటున్నారు..అంటూ ఎమోషనల్... భార్య చెప్పిన మాటల విన్న చాలా మంది కరిగిపోయారు..ఈసారి మాస్టర్ విన్ అవుతారని చాలా మంది అంటున్నారు.. చివరికి ఏమౌతుందో చూడాలి..