ఏకంగా షోలో నటికి ముద్దు పెట్టిన రవికృష్ణ..!

Suma Kallamadi
బుల్లితెరపై యాంకర్ సుమకి ఉన్న క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే యాంకర్ సుమ క్యాష్ ప్రోగ్రాం ద్వారా కోట్లాది మంది ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తుంది. అయితే వచ్చే వారం ఎపిసోడ్‌లో క్యాష్‌లో ఆమె కథ హీరో రవికృష్ణ, హీరోయిన్ నవ్యస్వామి గెస్ట్‌లుగా వచ్చారు. ఇక రవికృష్ణ వెనకాలే శివజ్యోతి కూడా వచ్చింది. అసలే వీరిద్దరిది బిగ్ బాస్ కలిపిపిన బంధం. ఈ షోలోనూ వీరిద్దరు రెచ్చిపోయి మరీ సెటైర్లు వేశారు. మరీ ముఖ్యంగా రవికృష్ణ ఓ రేంజ్‌లో ఆడుకున్నాడో చూడాలంటే ఈ ఎపిసోడ్ వచ్చే అంతవరకు ఆగాల్సిందే.

అయితే సుమ మీ ఆయన ఏం అబద్దం చెబుతాడు అని శివజ్యోతిని అడిగింది. ఇక మధ్యలో రవికృష్ణ వచ్చి.. నువ్వు అందంగా ఉంటావ్ అని ఒకటైతే చెబుతాడు అంటూ సెటైర్ వేశాడు. ఇక రవి ఎలాంటి అబద్దాలు చెబుతాడు అంటూ మళ్లీ శివజ్యోతిని ప్రశ్నించింది సుమ. వాడు చెప్పే అబద్దాలు బయటపెడితే.. అంటూ పూర్తి చేసేలోపు వద్దు అంటూ రవి గట్టిగా పట్టేసుకున్నాడు.అయితే  రవికృష్ణ, నవ్యస్వామిలకు సుమ ఓ టాస్క్ ఇచ్చినట్టు కనిపిస్తోంది ప్రోమోలో. వర్షంలో తడుస్తూ చెట్టుకింద ఉన్న ఓ ప్రేమజంటగా నటించారు. అంతలో మొక్కజొన్న పొత్తులు అమ్ముకునే క్యారెక్టర్‌లో సుమ వచ్చింది. గతేడాది ఎవరితోనో వచ్చావ్ కదా అంటూ ఫన్ క్రియేట్ చేసింది సుమ.



అనంతరం మరో స్కిట్‌లో మళ్లీ నవ్యస్వామిని, రవికృష్ణను వాడేసింది. ఇక షూటింగ్ సెట్, సుమ డైరెక్టర్‌గా నటించారు. రవికృష్ణ, నవ్యస్వామిలను నటించమని చెప్పారు. మా నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారని రవి అడగడంతో ఏం లేదని సుమ పంచ్ వేసింది. ఆ తరువాత నవ్యస్వామి మోకాళ్లపై కూర్చుని రవికృష్ణకు ప్రపోజ్ చేస్తుంది. వెంటనే రవి వచ్చి నవ్యస్వామిని ముద్దు పెట్టుకున్నాడు. దీంతో సుమ షాక్ అయింది. చేతుల్ని వణికిస్తూ.. ఈ సీన్ మనదాంట్లో లేదు అంటూ సెటైర్ వేసింది. సీన్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్దామని నేనే చేశాను అంటూ రవి మరో కౌంటర్ వేస్తాడు. ప్రోమో చూసిన నెటిజన్స్ వారి అభిప్రాయాలను తెలిజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: