మోనాల్ కి లవ్ ప్రపోజ్ చేసిన జబర్దస్త్ అవినాష్...?
తర్వాత మోనాల్ గజ్జర్ ను టీజ్ చేస్తూ అవినాష్ ఆమె చుట్టూ తిరుగుతూ ఆటపట్టించాడు. హలో గురూ ప్రేమ కోసమే అంటూ పాట పాడుతూ సరదాగా మోనాల్‌కు లవ్ ప్రపోజ్ చేశాడు. స్వీట్ గర్ల్, కాక్ టెయిల్ గర్ల్ అంటూ కామెంట్లు విసిరాడు. మోనాల్ అందాన్ని పొగుడుతూ అందర్నీ నవ్వించాడు. మొత్తానికి అవినాష్ తన కామెడీతో ఈరోజు షో కి హైలైట్ గా నిలిచాడు. మోనాల్, లాస్య, సుజాతను ఆటపట్టిస్తూ జబర్దస్త్ అవినాష్.... వారిపై జోకులు వేస్తూ ఈ రోజు షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. మోనాల్ అయితే అవినాష్ ని ఒక ఊపు ఊపేసింది.
ఆ తదుపరి బిగ్‌బాస్ షోలో టాస్క్ ల సందడి మళ్ళీ మొదలైంది..... పెద్దగా వివాదాలు లేకుండా 16వ రోజు టాస్కు, వినోదంతో గడిచిపోయింది. ఫిజికల్ టాస్క్ షురూ చేశారు బిగ్ బాస్. ఇంటి సభ్యులు రెండు జట్లు గా విడిపోయి గేమ్‌ను మొదలు పెట్టాలని ఆదేశించారు. ఒకటి మనుషుల టీం... మరొకటి రోబో టీం.... మనుషుల టీం గులాబీ రంగు దుస్తులు ధరించగా, రోబో గ్రూప్ సిల్వర్ కలర్ దుస్తులు ధరించి గేమ్ ఆడారు. ఏదేమైనా 16వ రోజు ఎపిసోడ్ మాత్రం ఎంతో వినోదంగా గడిచిందనే చెప్పాలి.