సెట్‌లో హీరోయిన్‌తో రాసలీలలని నన్ను పంపించేశారు..!
దీంతో సుమన్ అక్కడి నుండి సమీర్ ని బయటికి పంపించారని తెలిపారు. సుమన్ లొకేషన్‌లో ఉన్న వాళ్లని కూడా అడగలేదని అన్నారు. అయినా నాకు లొకేషన్‌లో రాసలీలలు జరపాల్సిన కక్కుర్తి నాకు ఏంటి? బయట ఎక్కడా లేదా? అక్కడకు పోలేమా?? నిజానికి నాకు అలాంటి ఉద్దేశాలు లేవు అని అన్నారు. కాని నేను స్టార్టింగ్ పనిచేసిన సీరియల్ దగ్గర నుంచి.. నేను ఎవరితో వర్క్ చేసినా.. నాతో లింక్ ఉందని అనేవారు. అయితే ఈ విషయంలో సుమన్ గారికి థాంక్స్ చెప్పాలని అన్నారు. ఆయన అప్పుడు నన్ను ఆ సీరియల్ నుంచి తప్పించకపోతే ఇప్పుడు ఇన్ని సినిమాలు చేసేవాడిని కాదని సమీర్ చెప్పుకొచ్చాడు.
అంతేకాకుండా సమీర్ ఉషాకిరణ్ మూవీస్ లైఫ్ ఇచ్చిందని వెల్లడించారు. ఫస్ట్ సీరియల్, ఫస్ట్ సినిమా వాళ్ల సంస్థల్లోనే చేశారని తెలిపారు. అన్నం పెట్టిన వాళ్లని తప్పుపట్టడం లేదు కాని అపార్థం చేసుకున్నారని అన్నారు. ఇక ప్రభాకర్ వచ్చి సుమన్ ప్లేస్‌ని తీసుకునే స్థాయికి వెళ్లాడని తెలిపారు. కాని మొదటి నుంచి నేను ఉన్నా కానీ.. ప్రభాకర్‌లో ఉన్న నేర్పు తనకు లేదంటూ వెల్లడించారు. ప్రభాకర్‌తో ఇప్పటికీ నాకు మంచి అనుబంధమే ఉండేదన్నారు. ఈ మధ్య కాలంలో బిజీ వల్ల కలవడం లేదని సమీర్ వెల్లడించారు.