ఇకపై ఓటిటి లోను కనిపించబోతున్న యాంకర్ సుమ...!

Suma Kallamadi
గత మూడు నెలల నుండి బుల్లితెర పై అనేక షోలు చిత్రీకరణ జరగని సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడిప్పుడే ప్రభుత్వం ఇచ్చిన అన్ లాక్ రూల్స్ ద్వారా షోల షూటింగ్ లు మొదలయ్యాయి. ఇక అసలు విషయం కొస్తే... బుల్లితెరలో యాంకర్ లలో అందరికీ బాస్ ఎవరంటే టక్కున చెప్పే సమాధానం సుమ కనకాల. ఎక్కడ ఏ షో చేసిన, ఏ లైవ్ ప్రోగ్రాం చేపట్టిన చాలా ఎనర్జిటిక్ గా యాంకరింగ్ చేసే వ్యక్తి సుమ కనకాల. ఇప్పటికే వివిధ ఛానల్ లో వివిధ రకాల షోలతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుంది సుమ. ఇక బుల్లితెరను దాటి వెండితెర మీద కూడా అనేక సినిమాల్లో నటించారు సుమ. ఇక ఇప్పుడు ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి కూడా అడుగు పెడుతుంది యాంకర్ సుమ. ఈ మేరకు ఆహా సోషల్ మీడియా ద్వారా ఆగస్టు 3న సాయంత్రం 5 గంటలకు ఒక బిగ్ అనౌన్స్మెంట్ చేయనున్నారు యాంకర్ సుమ.


ఆహా యాప్ కు సంబంధించి పేస్ బుక్ అకౌంట్ ద్వారా సుమ కనకాల లైవ్ సెషన్ లోకి రాబోతున్నారు.ఈ లైవ్ లో సుమ తో పాటు ప్రముఖ చిత్ర నిర్మాత దిల్ రాజు, హాస్యనటులు హర్ష మొదలగు ఆర్టిస్టులు పాల్గొన్నారు. అయితే యాంకర్ సుమ ఈ విషయానికి సంబంధించి ఆ ప్రోగ్రాం లో చాలా సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలియజేసింది. ఇక ఆ విశేషాలు ఏమిటో తెలియాలంటే సాయంత్రం 5 వరకు వేచి ఉండాల్సిందే మరి.



లాక్ డౌన్ నేపథ్యంలో ఆగిపోయిన ప్రోగ్రామ్స్ షూటింగ్ ఎట్టకేలకు మొదలు కావడంతో మళ్లీ సుమ రంగంలోకి దిగింది. తాను యాంకర్ గా కొనసాగుతున్న క్యాష్, ఇతరాత్ర షూటింగ్ లలో ఆవిడ పాల్గొంటున్నారు. తాజాగా ఆమె షూటింగ్ లో పాల్గొన్న ఫోటోలను కూడా ఆవిడ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే ఓక యాంకర్ ఇలా ఓటిటి ప్లాట్ ఫామ్ లో జత కట్టడం ఇదే మొదటిసారి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: