బుల్లి పిట్ట: జియో ఓటిటి ప్లాన్ లాంచ్..!!

Divya
జియో టెలికాం యొక్క సంస్థ OTT ప్లాట్ ఫామ్ ను మొదలుపెట్టింది. అదే జియో సినిమా యాప్.. తాజాగా సబ్స్క్రిప్షన్ ప్లాన్ ను ప్రకటించింది. ఈ ప్లాన్ ప్రీమియం కంటెంట్ను యాక్సిస్ చేసుకోవడానికి వినియోగదారులకు అనుమతిస్తోంది ఈ యాప్ మొదట వినియోగదారులకు కొన్ని ప్రసిద్ధ చలనచిత్రాలతో పాటు ఉచితంగా స్త్రమ్మింగ్ తో.. వరల్డ్ కప్ మరియు ఐపీఎల్ ఏడాది ఉచితంగా అందించడం ద్వారా తమ కస్టమర్ల బేసిక్ ను పెంచుకోబోతోంది. ఇప్పుడు జియో సినిమాలో జియో ప్రీమియం ప్లాన్ ను ప్రారంభించడానికి సిద్ధమయ్యింది.
ఈ జియో సినిమా ప్లాన్ ద్వారా వినియోగదారులు HBO వంటి ప్రధాన స్టూడియో ల నుంచి కంటెంట్ ను చూడవచ్చు జియో సినిమా ప్రీమియంలో ప్రసారమయ్యే కొన్ని HBO షోలలో ది లాస్ట్ ఆఫ్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ వంటి సక్సెస్ చిత్రాలను చూడవచ్చు అదనంగా మరికొన్ని షోలతో పాటు ఈ ఫ్లాట్ ఫామ్ లో రాబోయే రెండు నెలల్లో వాటిని జోడించే విధంగా ప్లాన్ చేస్తోంది. జియో సినిమా యాప్ కస్టమర్లు ఆండ్రాయిడ్, IOS పరికరాలలో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు జియో సినిమా సబ్స్క్రిప్షన్ ఫీజు ఇతర సమాచారాల విషయానికి వస్తే..
జియో సినిమా అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి సబ్స్క్రిప్షన్ బటన్ మీద క్లిక్ చేస్తే ప్రస్తుతం ప్లాన్ ద్వారా ఏడాదికి రూ.999 రూపాయలుగా ఉన్నది. ఎలాంటి వాటిలోనైనా సరే జియో సినిమాలను చూడగలిగేలా కంపెనీ అధిక వీడియో మరియు నాణ్యతను కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ పూర్తి ఫీచర్ విషయానికి వస్తే నాలుగు పరికరాలలో ఈ ప్లాన్ పనిచేస్తుంది... ఒకరు కొనుగోలు చేస్తే కుటుంబ సభ్యులు లేకపోతే స్నేహితులు కూడా షేర్ చేసుకోవచ్చు ప్రస్తుతం వినియోగదారులకు ఒక ఏడాది సబ్స్క్రిప్షన్ ప్లాన్ మాత్రమే అందుబాటులో ఉంచినది. ఇండియన్ స్ట్రిమింగ్ మార్కెట్లోకి పోటీగా jio OTT విడుదల చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: