వాట్సాప్: సూపర్ ఫీచర్.. ఫేక్ కాల్స్ కి పర్మినెంట్ చెక్?

ఫేమస్ ఇంటర్నేషనల్ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ యూజర్లకి కూడా కొందరికీ అప్పుడప్పుడు ఫేక్ కాల్స్, స్పామ్ మెసేజెస్ వస్తుంటాయి.వాటిని తెలిసీ తెలియక కాల్ లిఫ్ట్ చేసినా లేదా మెసేజ్‌లోని లింక్‌లపై క్లిక్ చేసినా ఖచ్చితంగా మోసపోయినట్లే. క్షణాల్లో ఫోన్ హ్యాక్ కావడం లేదా బ్యాంక్ బ్యాలన్స్ మాయమవడం వంటి దారుణం జరిగిపోతుంది. కేవలం అంతేకాదు మీ వాట్సాప్‌లోని చాట్‌లతో పాటు, యాప్ వాయిస్, వీడియో కాల్‌లకు కూడా యాక్సెస్‌ సైబర్ నేరగాళ్ల చేతుల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని వారాలుగా +84, +62, +60 వంటి పలు అంతర్జాతీయ నంబర్ల నుంచి కొన్ని స్పామ్ కాల్స్ అనేవి వస్తున్నాయి. ముఖ్యంగా భారతీయ వాట్సాప్ యూజర్లే వీటికి టార్గెట్‌గా మారారు. అంతర్జాతీయ స్పామ్ కాల్స్ గురించి వచ్చిన నివేదికలపై భారత ప్రభుత్వం వాట్సాప్‌కు నోటీసు కూడా పంపడం జరిగింది. ఇక ఈ ఫేక్ కాల్స్ నుంచి ఏ విధంగా తప్పించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక వాట్సాప్ ప్రస్తుతం గుర్తుతెలియని కాల్స్‌ను సైలెంట్ చేసేందుకు ఓ ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తోంది.

అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం ఎంపిక చేసిన బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో వాట్సాప్ రెగ్యులర్ యూజర్లు అందరికి కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి రానుందని భావిస్తున్నారు.ఇక ఈ ఫీచర్‌ని ఎలా ఆన్ చేయాలంటే..ముందుగా మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లోని వాట్సాప్ ఓపెన్ చేసి.. కార్నర్‌లో ఉన్న త్రి డాట్స్ మెనుపై క్లిక్ చేసి ఆ తర్వాత 'Settings' ఓపెన్ చేసి అందులోని 'Privacy'పై క్లిక్ చేయండి. తరువాత అందులోని 'Calls'పై నొక్కి వాట్సాప్‌లో గుర్తు తెలియని కాల్‌లను సైలెంట్ చేసేందుకు టోగుల్‌ను ప్రారంభించండి.ఇక ఇలా అన్ని రకాల గుర్తు తెలియని కాల్‌లను ఈజీగా సైలెంట్ చేయొచ్చు. అయితే మీరు ఏదైనా కాలర్ నంబర్‌ను సేవ్ చేయకుంటే ముఖ్యమైన కాల్స్ మిస్ అయ్యేందుకు కూడా ఛాన్స్ ఉంది. అలాగే మీరు ఈ ఫీచర్ పెట్టుకున్నప్పటికీ స్పామర్‌లు మీకు కాల్ చేసేందుకు కూడా అనుమతిస్తుంది.అయితే స్కామర్లు కాల్ చేసినప్పుడు మీకు తెలియనివి అయితే మీరు వాటిని అస్సలు లిఫ్ట్ చేయలవద్దు.అందువల్ల మోసపోకుండా ఉండేందుకు అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: