బుల్లి పిట్ట: బడ్జెట్ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇలా పొందండి..!

Divya
గత ఏడాదిగా ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సరికొత్త టెక్నాలజీలతో కూడిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా కస్టమర్లను ఆకర్షించడానికి సిద్ధం అవుతున్నాయి. తక్కువ ధరకే ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనడానికి కస్టమర్లు సైతం తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక మీరు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే మీకోసం ఒక చక్కటి శుభవార్తను తీసుకు రావడం జరిగింది. అంతేకాకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో రకరకాల ఫీచర్లతో పాటు తక్కువ ధరకే లభిస్తూ ఉండడం గమనార్హం.
బౌన్స్ ఇన్ఫినిటీ ఈ-వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు కస్టమర్లను ఆకర్షించడానికి అధునాతన ఫీచర్లతో సిద్ధమయ్యింది.  ముఖ్యంగా మీరు ఇంట్లో దీనికి చార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. క్షణాల్లో ఫుల్ బ్యాటరీ మీకు లభిస్తుంది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క పూర్తి వివరాలను ఒకసారి చదివి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.64,299.. ఈ స్కూటర్లో బ్యాటరీ షాపింగ్ ఫీచర్ అనేది ఉంది అంటే మీరు ఇంట్లో బ్యాటరీ చార్జింగ్ పెట్టాల్సిన పనిలేదు బ్యాటరీ నెట్వర్క్ చార్జింగ్ స్టేషన్ వద్దకు వెళ్లి ఫుల్ బ్యాటరీని కూడా పొందే అవకాశం ఉంటుంది.
మీ బ్యాటరీ అక్కడ పెట్టి అక్కడ ఫుల్ చార్జింగ్ గా ఉన్న బ్యాటరీ తీసుకొని ఆ తర్వాత మీరు స్కూటర్లో కూడా వేసుకోవచ్చు. స్పీడ్ విషయానికి వస్తే గంటకు 65 కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్తుంది. కేవలం రూ.499 తో ఈ స్కూటర్ 2 ని మీరు బుక్ చేసుకోవచ్చు. కంపెనీ వెబ్సైట్ కి వెళ్లి మీరు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ను బుక్ చేసుకుంటే అదనపు చార్జీలు కట్టాల్సిన అవసరం ఉండదు. అలాగే లైవ్ ట్రాకింగ్ ట్రాక్ , బ్యాటరీ హెల్త్,  జియో ఫెన్సింగ్ , ఆంటీ తెఫ్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.  ముఖ్యంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పలు రకాల కలర్ ఆప్షన్లలో లభిస్తుంది . మీరు వైట్ , బ్లాక్ , రెడ్,  గ్రే,  సిల్వర్ కలర్స్ లో మీకు నచ్చిన కలర్ను ఈ స్కూటర్ కొనుగోలు చేయవచ్చు. స్పీడు డిస్ప్లే వెహికల్ స్టేటస్ ,బ్యాటరీ ఎస్ఓసి స్టేటస్, ఇండికేటర్ స్టేటస్, ఇగ్నిషన్ స్టేటస్,  బ్లూటూత్ స్టేషన్ తో పాటు హై బీమ్ స్టేటస్ వంటివి కూడా చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: