USB టైప్-C పోర్టుతో రానున్న ఆపిల్ ఎయిర్ ప్యాడ్స్ ప్రో2?

ఫేమస్ టెక్ కంపెనీ ఆపిల్ (Apple) ఈ ఏడాది చివరిలో కొత్త ఇయర్‌ఫోన్‌లను లాంచ్ చేయనుంది. కొన్ని నివేదికల నుంచి తెలుస్తున్న సమాచారం ప్రకారం..ఎయిర్‌పాడ్స్ ప్రో 2 (Apple AirPods Pro 2) ఇయర్ ఫోన్‌లను విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఇక రాబోయే ఎయిర్‌పాడ్‌లు లైటనింగ్ పోర్ట్‌కు బదులుగా USB టైప్-C పోర్ట్‌ను కలిగి ఉండనున్నాయి.పిల్ యూఎస్‌బీ పోర్ట్‌లకు మారడానికి చాలా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఎందుకంటే, విస్తృత శ్రేణి అప్లియెన్సెస్ అలాగే ఛార్జర్‌లకు సపోర్టు అందిస్తుంది. అందువల్ల మరింత సౌకర్యవంతంగా ఇది యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ఆపిల్ USB టైప్-C పోర్ట్‌తో కూడిన AirPods ప్రో 2 ఈ సంవత్సరం చివరిలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని ఆ నివేదిక తెలిపింది.ఇక ఈ AirPods ప్రో 2 USB-C వెర్షన్‌తో రావొచ్చునని భావిస్తున్నారు. ఆపిల్ కంపెనీ ప్రస్తుతం AirPods 2 & 3 USB-C వెర్షన్‌ల కోసం ఎలాంటి ప్లాన్ లని కలిగి లేదని Kuo సోషల్ మీడియా ద్వారా తెలిపడం జరిగింది.


ఇక లేటెస్ట్ iOS 16లో మోడల్ నంబర్‌లు A3048, A2968తో కొత్త AirPodలు వస్తాయని సమాచారం తెలిసింది.ఇక టైప్-C ఛార్జింగ్ పోర్ట్‌తో రాబోయే AirPods ప్రో 2 కావచ్చని Kuo భావిస్తున్నారు.కొత్త AirPods Pro 2 మోడల్ 2023 రెండో లేదా మూడో త్రైమాసికంలో ఎప్పుడైనా అందుబాటులోకి రావొచ్చునని సమాచారం తెలుస్తుంది. AirPods 2, 3 మోడల్ USB-C వెర్షన్‌లతో ఆపిల్ కంపెనీ లాంచ్ చేయకపోవచ్చు. కేవలం ప్రీమియం డివైజ్‌లలో మాత్రమే USB-C సపోర్టు అందిస్తుంది.ఆపిల్ iphone 15 సిరీస్‌ను USB టైప్-C పోర్ట్‌తో లాంచ్ చేసే ఛాన్స్ ఉంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం.. ఆపిల్ USB-C పోర్ట్‌కు లైటనింగ్ పోర్ట్‌లోని అథెంటికేషన్ ప్రాసెస్ లాగానే కస్టమ్ IC చిప్‌ను యాడ్ చేయొచ్చు.ఇక మేడ్ ఫర్ ఐఫోన్ ప్రోగ్రామ్‌లో లేని ఆపిల్ యేతర యాక్సెసరీలు పని చేయకపోవచ్చు. స్పీడ్ ఛార్జింగ్, హై-స్పీడ్ డేటా ట్రాన్స్‌ఫర్ పరిమితం అవ్వొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: