బుల్లి పిట్ట:హీరో నుంచి రిజిస్ట్రేషన్ డ్రైవింగ్ లైసెన్స్ లేని ఎలక్ట్రిక్ బైక్..!!

Divya
ప్రముఖ టూవీలర్ దిగ్గజ సంస్థలలో హీరో కూడా ఒకటి. ఈ మధ్యకాలంలో ఈ హీరో కంపెనీ నుంచి ఎలక్ట్రిక్ బైక్ లు కూడా విడుదలవుతున్నాయి. ఇక పలు ద్విచక్ర వాహనాలతో పాటు,ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల విడుదల చేసిన హీరో ఎడ్జి ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రత్యేకంగా ఆకర్షణీయంగా నిలుస్తోంది. మరి ఈ ఎలక్ట్రిక్ బైక్ ఫీచర్స్, ధర గురించి ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.
ఈ ఎలక్ట్రిక్ బైక్ ని ఒక్కసారి చార్జి చేస్తే చాలట. దాదాపుగా 85 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ని ఫుల్ చార్జింగ్ చేయడానికి 4 నుంచి 5 గంటల సమయం కేటాయించవలసి ఉంటుంది. ఈ స్కూటర్ బ్యాటరీ కెపాసిటీ..51.2 v గా  ఉంటుందట. ఈ బైక్ బ్యాటరీ రేటింగ్ 30AH ఉంది. ఈ బైక్ స్పీడు గంటకు 25 కిలోమీటర్ల వరకు అందుబాటులో కలదని ఆ సంస్థ తెలియజేస్తోంది. ఈ స్కూటర్ కు రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ అసలు అక్కర్లేదని అలాగే స్కూటర్  స్టైలిష్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉందని తెలుస్తోంది.

ఈ బైక్ ఎక్కడున్నా సరే ఈజీగా కనుక్కునేందుకు ఫైండ్ మై బైక్ అనే ఆప్షన్ కూడా ఉన్నదట. మొబైల్ యాప్ కంపెనీ ద్వారా వీటిని చెక్ చేసుకోవచ్చు. పార్కింగ్ లాట్ లో బండి ఉన్నచోట నుంచి హార్న్ , లైట్స్ కనిపిస్తుంది. బ్లూటూత్ ద్వారా దీన్ని లాక్ చేసుకోవచ్చు అన్లాక్ చేసుకోవచ్చు. స్కూటర్ కి ఎల్ఈడి హెడ్లైట్ ఉన్నవి అలాగే కుషన్తో కూడిన బ్యాటరీ కూడా ఉన్నది. స్కూటర్ కు USB పోర్టు కూడా కలదు. అందువల్లే ఈజీగా చార్జింగ్ చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో దీని ధర సుమారుగా రూ.72,000  రూపాయలు కలదు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని బుక్ చేసుకునేందుకు రెండు నెలల ముందే బుక్ చేసుకోవాలట. కేవలం డీలర్ షిప్ నుంచి డెలివరీ చేస్తారని కంపెనీ తెలియజేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: