వామ్మో.. క్రెడిట్ కార్డుల వినియోగం.. లక్ష కోట్ల పైనే?

praveen
ప్రస్తుతం టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దీంతో సామాన్యులు సెలబ్రిటీలు అనే తేడా లేదు ప్రతి ఒక్కరికి టెక్నాలజీ ఒకే రీతిలో ఉపయోగపడుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టెక్నాలజీని ఉపయోగించుకుని ఎంతోమంది అద్భుతాలు చేస్తూ ఉన్నారు. ఇక ఇలా టెక్నాలజీ ఎక్కువ అవ్వడం కారణంగా ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ఆర్థిక సమస్యలు కూడా తీరిపోయాయి అని చెప్పాలి.ఎందుకంటే ఒకప్పుడు ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు ఎవరి దగ్గరైనా అప్పుతీసుకోవడం లాంటివి చేస్తూ ఉండేవారు.

 కానీ ఇటీవల కాలంలో ఆర్థిక సమస్యలు రాకపోయినా పర్వాలేదు.. వేరొకరి దగ్గర చేయి చాచాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే అవసరం లేకపోయినా అప్పు ఇస్తాం అంటూ ఇటీవల కాలంలో ఎన్నో బ్యాంకులు పోటీ పడుతూ ఉన్నాయి. రుద్దీ రుద్ది మరీ అప్పులు ఇస్తున్నాయి. ఇక ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డుల పేరుతో ఇక విచ్చలవిడిగా అప్పులు కూడా ఇస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే సామాన్యులు సైతం ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డు వినియోగిస్తూ ఉండడం కనిపిస్తూ ఉంది. ఇక డబ్బులు లేకపోయినా సరే.. ఈ క్రెడిట్ కార్డుల ద్వారానే భారీగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ అవసరాలు తీర్చుకుంటూ ఉన్నారు అని చెప్పాలి.

 ఇలా ఎక్కడికి వెళ్లినా ఏం చేసిన కూడా క్రెడిట్ కార్డులనే ఎక్కువగా వినియోగిస్తూ ఉండడం గమనార్హం. అయితే ఇటీవలే ఆర్.బి.ఐ కూడా ఇదే విషయాన్ని నిర్ధారించింది. దేశంలో క్రెడిట్ కార్డు వినియోగం భారీగా పెరుగుతున్నట్లు తెలిపింది. క్రెడిట్ కార్డుల ద్వారా దేశంలో చేసే ఖర్చు నెలకు లక్ష కోట్ల రూపాయల వరకు దాటుతుందని వెల్లడించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ జనవరిలో క్రెడిట్ కార్డులతో ఏకంగా 1.28 లక్షల కోట్లకు పైగా కొనుగోలు జరిగాయట. ఈ కొనుగోళ్లలో 61% ఈ కామర్స్, పాయింట్ సేల్ వద్ద 37% జరిగినట్లు ఆర్బిఐ తెలిపింది. కాగా 2022 అక్టోబర్లో 1.29 లక్షల కోట్ల క్రెడిట్ కార్డు వినియోగం జరిగింది అని చెప్పాలి. ఇప్పటివరకు ఇదే టాప్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: