EV: మార్కెట్లోకి తక్కువ ధరలో బ్యాటరీలు..?

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. దానిని అందిపుచ్చుకునేందుకు చాలా కంపెనీలు కూడా సరికొత్త వాహనాలని తయారు చేసి మార్కెట్లో రిలీజ్ చేస్తున్నాయి. అయితే అన్ని కంపెనీలు అయితే దాదాపు లిథియం అయాన్ బ్యాటరీలనే ఎక్కువగా వినియోగిస్తున్నాయి.అయితే ప్రపంచంలో మొట్టమొదటి సోడియం అయాన్ బ్యాటరీతో నడిచే వెహికిల్ ని చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ అయిన జేఏసీ ఆటో లాంచ్ చేసింది. లిథియం అయాన్ బ్యాటరీల కన్నా తక్కువ ధరకు వీటిని అందించనుంది. ఈ అయాన్ బ్యాటరీని చైనా బీజింగ్ కు చెందిన స్టార్టప్ హీనా బ్యాటరీ టెక్నాలజీస్ డెవలప్ చేసిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది. ఈ సోడియం-అయాన్ బ్యాటరీని వాడటం వల్ల ఎలక్ట్రిక్ వాహనాల ధర కనీసం 10 శాతం తగ్గుతుందని, పెట్రోల్ ఇంకా డీజిల్ లేదా cng వాహనాలతో పోలిస్తే ఈవీల పనితీరును బాగా మెరుగు పరుస్తుందని మార్కెట్ల వర్గాలు అంచనా వేస్తున్నాయి.సోడియం-అయాన్ బ్యాటరీలు చౌకైన ముడి పదార్థాలను వాడి తయారు చేయబడ్డాయి. అందువల్ల ఈ బ్యాటరీ ధర కూడా తగ్గుతుంది. దాని ఫలితంగా ఎలక్ట్రిక్ వాహనం ధర కూడా తగ్గే అవకాశం ఉంది.


అంతేకాక మార్కెట్లో మోనో పోలి ఛాన్స్ లేకుండా సోడియం అయాన్ బ్యాటరీలు ప్రత్యామ్నాయంగా నిలబడతాయి.సాధారణంగా లిథియం అనేది చాలా ఖరీదైనది. అలాగే కోబాల్ట్ కూడా చాలా ఖరీదైనది. అందుకే వీటిని వినియోగించకుండా సోడియం వినియోగించడం ద్వారా మొత్తం ధర ఈజీగా తగ్గుతుంది.ఇక చైనీస్ జేఏసీ నుంచి వచ్చిన సోడియం అయాన్ బ్యాటరీ వాహనంలో 25 కిలోవాట్-అవర్ (kWh) బ్యాటరీ ఫిక్స్ చేయబడి ఉంటుంది. ఇది ఒక్కసారి ఛార్జింగ్‌పై ఏకంగా 250 కిలోమీటర్ల దూరం వెళ్లగలుగుతుంది. ఇక లిథియం కార్బోనేట్ ధరలు పెరగడం వల్ల చాలా మంది బ్యాటరీ తయారీదారులు, వినియోగదారులు ఖర్చు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అందువల్ల ప్రత్యామ్నాయం ఉంటే మంచిదని నిర్ధారించి ఆ దిశగా ప్రయోగాలు చేసి సోడియం-అయాన్ బ్యాటరీలు తయారు చేస్తున్నారు. ఇది మెరుగైన ధరలో మంచ పనితీరు ఇంకా అధిక భద్రత అందిస్తాయట. ఇవి లిథియం-అయాన్ బ్యాటరీలకు అత్యంత ఆశాజనక ప్రత్యామ్నాయంగా నిలబడతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: