కరెంట్ లేకుండానే బోర్ నుండి నీళ్లు.. ఏం ఐడియా గురూ?

praveen
ఇటీవల కాలంలో విద్యుత్ అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది.ఎందుకంటే ప్రస్తుతం ఏం చేయాలన్నా కూడా కరెంట్ ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం జాబ్ కి వెళ్లి కంప్యూటర్ మీద కూర్చుని పని చేయాలన్న లేదా వ్యవసాయం చేసేందుకు పంటను పండించుకోవాలన్నా కరెంటు కావాలి. ఎందుకంటే కంప్యూటర్ పని చేసేది విద్యుత్ తోనే. ఇక బోర్లు నడిచి పంటలు బాగా పండేది కూడా కరెంటు తోనే. దీంతో నేటి రోజుల్లో కరెంటు వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది అని చెప్పాలి. కొన్ని కొన్ని సార్లు ఇక కరెంటు మోతల నుంచి సామాన్య ప్రజలు తప్పించుకోలేకపోతున్నారు.

 ఇక్కడ కరెంట్ చార్జీల కారణంగా అతను ఎంత ఇబ్బంది పడ్డాడో తెలియదు. కానీ కొత్త ఆవిష్కరణకు తెర లేపాడు.  తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల గ్రామానికి చెందిన శ్రీనివాసులు, లతా దంపతులకు శివకుమార్ అనే కొడుకు ఉన్నాడు. అతను వడ్రంగి పనిచేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు. అయితే 12 ఏళ్లుగా సొంత ఇల్లు కట్టుకోవాలని ఎన్నో కలలు కన్నాడు. ఇక పైసా పైసా కూడా పెట్టి ఒక భూమి కూడా కొనుక్కున్నాడు. అయితే ఇంటి నిర్మాణం అంటే కచ్చితంగా నీళ్లబోరు ఉండాల్సిందే. దీనికోసం బోరు వేయించాడు. నీళ్లు కూడా వచ్చాయి. కానీ నిరంతరం బోరు లో నీరు పైనకి రావాలంటే తప్పకుండా కరెంటు వాడాలి. అయితే అతను ఇల్లు స్థలం కొన్న ప్రాంతంలో కరెంటు స్తంభాలు మాత్రం ఏవీ లేదు. విద్యుత్ అధికారులకు అర్జీ పెట్టుకున్న ఇక స్తంభాలు పాతెందుకు అయ్యే ఖర్చు మొత్తం మీరే పెట్టుకోవాలంటూ తేల్చి చెప్పారు.

 ఈ క్రమంలోనే శివకుమార్ ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం కనుగొనాలి అని భావించాడు. ఇక స్వతహాగా వడ్రంగి కావడంతో తనకున్న మేదస్సుతో కరెంటు మోటార్ ని పెట్టి బైక్ వెనకాల చక్రాన్ని అమర్చాడు. చక్రం తిరిగినంత సేపు ఇక మోటార్ తిరుగుతూ ఉంటుంది. తద్వారా మోటార్ నుంచి వచ్చే శక్తితో బోరు మోటర్ కూడా తిరుగుతుంది. ప్రెజర్ కి బోర్ లో ఉన్న నీళ్లు బయటకు వస్తాయి. ఒకసారి ఇక ఈ ఆలోచనను ఆచరణలో పెట్టాడు. ఇంకేముంది నీళ్లు ప్రవాహంలా బయటికి దూకాయి. దీంతో అతని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఇక అదే బోరు మోటార్ సహాయంతో ప్రస్తుతం ఇల్లు నిర్మాణం కూడా చేపడుతున్నాడు.. ఇల్లు నిర్మాణం కోసం నీటిని పైకి రప్పించడానికి రోజుకు 200 రూపాయలు పెట్రోల్ ఖర్చు అవుతుందని శివకుమార్ చెబుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: