బుల్లి పిట్ట:సాంసంగ్ గెలాక్సీ-23 మొబైల్ పై రూ.13 వేలు తగ్గింపు..!!

Divya
ఇండియాలో సాంసంగ్ స్మార్ట్ మొబైల్ కు విపరీతమైన క్రేజీ ఉందని చెప్పవచ్చు.. ఈమధ్య కంపెనీ తమ కొత్త స్మార్ట్ మొబైల్ సిరీస్ లను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడం జరుగుతోంది .ముఖ్యంగా గెలాక్సీ మొబైల్స్ విడుదల చేస్తూ ఉన్నది. తాజాగా గెలాక్సీ-23 సిరీస్ కలిగిన ఒక కొత్త ఫ్లాట్ షిప్ మొబైల్ లను ఇప్పుడు భారీ డిస్కౌంట్ ఆఫర్లతో అందుబాటులోకి తీసుకువస్తోంది కస్టమర్ల కోసం. అయితే ఇది ఇంకా వినియోగదారులకు అందుబాటులోకి రాలేదు. ఈనెల 23వ తేదీ నుంచి అందుబాటులోకి రాబోతున్నట్లు ఆ సంస్థ తెలియజేస్తోంది.

అయితే ముందస్తు బుకింగ్ కు సాంసంగ్ కు అవకాశం కలిపిస్తోంది. గెలాక్సీ ఎస్ 23 పై ఏకంగా రూ .13 వేల రూపాయలను డిస్కౌంట్ ప్రకటిస్తోంది. అదనంగా కొన్ని బ్యాంకు ఆఫర్లను కూడా వర్తిస్తాయి.. అమెజాన్ ఆఫర్లు గెలాక్సీ ఎస్ 23 మొబైల్ ప్రారంభం ధర.. రూ.74,999 రూపాయలు కలిగిన ఈ మొబైల్ రూ .5000 డిస్కౌంట్ను కూడా పొందవచ్చు. ఇక అంతే కాకుండా అదనంగా ఐసిఐసిఐ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డు ఉపయోగించి కొనుగోలు చేసినట్లు అయితే ఎనిమిది వేల రూపాయల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. రూ.66,999 రూపాయలకే లభిస్తుంది.
స్పెసిఫికేషన్స్:
సాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 మొబైల్ వినియోగదారులకు రెండు వేరియన్ విడుదల చేయడం జరిగింది ఇందులో అద్భుతమైన ఫోటోగ్రఫీ అనుభవాన్ని కలిగిస్తాయట. ఇక వేరు వేరు బ్యాటరీలు కెమెరా సెటప్ లు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇతర ఫీచర్స్ ఉన్నందువల్ల వీటి మధ్య ధరలలో వ్యత్యాసం ఉంటుందని తెలుపుతోంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే..3900 mah సామర్థ్యం కలిగిన బ్యాటరీ 45w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుందట. ఇక ఇందులో 512 GB స్టోరేజ్ కెపాసిటీ కలిగి ఉంటుందట. సాంసంగ్ కస్టమర్ కోసం ఈ మొబైల్ ని ప్రత్యేకమైన డిస్కౌంట్తో అందిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: