బుల్లి పిట్ట: జియో.. రూ.895 ప్లాన్ కే 336 రోజుల అన్లిమిటెడ్ బెనిఫిట్స్.!

Divya
దేశంలోని టెలికాం నెంబర్ వన్ దిగ్గజ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న రిలయన్స్ జియో అతి తక్కువ ధరలోనే 336 రోజులపాటు అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అందించడానికి ఒక ప్లాను అందుబాటులోకి తీసుకొచ్చింది అయితే ఇది కేవలం జియో ఫోన్ యూజర్ల కోసం మాత్రమే వర్తిస్తుంది అని కూడా స్పష్టం చేసింది. రూ.895 ప్లాన్ పై 336 రోజులపాటు అన్లిమిటెడ్ బెనిఫిట్స్ పొందవచ్చు అని ఆ ప్లాన్ గురించి పూర్తి వివరాలను కూడా వెల్లడించింది..
జియో ఫోన్ యూజర్ల కోసం మాత్రమే ఈ ప్లాన్ తీసుకురావడం గమనార్హం 336 రోజుల లాంగ్ వ్యాలిడిటీతో ఈ ప్లాన్ వస్తుంది ముఖ్యంగా పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సదుపాయాలతో పాటు ప్రతి 28 రోజులకు 2gb డేటా చొప్పున 12 నెలల గాను 24జిబి హై స్పీడ్ డేటాను పొందుతారు. అలాగే నెలకు 50 ఎస్ఎంఎస్ లో చొప్పున 12 నెలలకు 600 ఉచిత ఎస్ఎంఎస్లను కూడా పొందే అవకాశం ఉంటుంది. వీటితోపాటు అన్ని జియో ఆప్స్ అయినా జియో టీవీ జియో సినిమా జియో క్లౌడ్ జియో మ్యూజిక్ ఇలా అన్ని జియో ఆప్స్ కి ఉచితంగా సబ్స్క్రిప్షన్ పొందవచ్చు.
ఇక ఇదే వ్యాలిడిటీని ఇతర యూజర్లు కూడా పొందాలి అంటే రూ.2999 ప్లాన్ ఎంచుకోవాలి. ఇది 388 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది అంతేకాదు అన్లిమిటెడ్ ప్రయోజనాలు కూడా కస్టమర్లు పొందవచ్చు. ప్రతిరోజు 2.5 జిబి డేటా చొప్పున 388 రోజులపాటు డేటా వినియోగం ఉంటుంది. మొత్తానికైతే జియో ఫోన్ యూజర్లకు ఇది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు ఈ ప్లాన్ మీకు మరిన్ని ప్రయోజనాలను అందించడానికి ఎప్పటికప్పుడు రకరకాల రీఛార్జి ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఏది ఏమైనా జియో తన కస్టమర్ల కోసం మంచి చక్కటి శుభవార్తను తీసుకొచ్చింది అని చెప్పడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: